కరెంట్ పోల్ పైన పక్షి గూళ్లు .. ఆఫ్రికాలో అద్భుతం వీడియో
సాధారణంగా పక్షులు చెట్ల పొదల్లోనో, ఇంటి దగ్గర్లోనో గూళ్లు కట్టడం చూశాం. అవి కూడా చిన్నగా.. తమకు సరిపోయే విధంగా.. చాలా పకడ్బంధీగా కట్టుకుంటాయి. వేటికవే రక్షణను ఏర్పరుచుకుంటాయి. ఇతరులను తమ గూళ్లోకి అనుమతించవు. కానీ ఈ పక్షులు మాత్రం కరెంట్ పోల్ ఎంత ఎత్తుందో.. అంత పొడవుగా కట్టేస్తాయి. పైగా గ్రూప్‌గా కట్టుకుని.. హాయిగా ఇందులో నివసిస్తాయి.
దక్షిణాఫ్రికాలోని కలహారి ఎడారిలో ఈ అద్భుతమైన గూళ్లు కనిపిస్తుండగా.. కరెంట్ స్తంభాలా రాజమౌళి సినిమా సెట్టింగులా అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. సోషబుల్ వీవర్ పక్షులు.. వీటి శాస్త్రీయ నామం ఫిలెటైరస్ సోషియస్. దక్షిణాఫ్రికాలోని కలహారి ఎడారిలో ఈ గూళ్ళను నిర్మిస్తాయి. ఎడారిలో చెట్లు అరుదుగా ఉండటం వల్ల.. అవి తరచుగా టెలిఫోన్ స్తంభాలపై గూళ్ళను నిర్మిస్తాయి. గడ్డి, కొమ్మలతో నేసిన ఈ భారీ గూళ్ళు 100 పక్షుల వరకు, పిగ్మీ ఫాల్కన్‌లు, రోజీఫేస్డ్ లవ్‌బర్డ్స్ వంటి బహుళ జాతులకు ఆశ్రయమిస్తాయి. అంతేకాదు తీవ్రమైన ఉష్ణోగ్ర్గతల నుంచి రక్షణ కల్పిస్తాయి. విశ్రాంతి, సంతానోత్పత్తి కోసం ప్రత్యేక గదులను కలిగి ఉంటాయి. కొన్ని గూళ్ళు దశాబ్దాలపాటు ఉంటాయి.. కాలంతో పాటు పెరుగుతూ.. స్తంభాల ఎత్తు వరకు అల్లుకుపోతాయి.
మరిన్ని వీడియోల కోసం :
దృశ్యం 3’ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్..
నాగార్జున కాళ్లు మొక్కేది.. ఆ ఒక్కడికే వీడియో
ప్యారిస్ మ్యూజిక్ షోలో.. సిరంజిలతో దాడి వీడియో
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో
