Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దృశ్యం 3’ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది..బ్లాక్ బ‌స్టర్ కాంబో రిపీట్‌..

దృశ్యం 3’ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది..బ్లాక్ బ‌స్టర్ కాంబో రిపీట్‌..

Samatha J
|

Updated on: Jun 27, 2025 | 4:36 PM

Share

మోహన్ లాల్ , జీతూ జోసెఫ్ కాంబో లో వచ్చిన.. దృశ్యం మూవీ సంచలనం సృష్టించింది. దృశ్యం 1, 2 పార్ట్‌లుగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ మూవీలోని ట్విస్టులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాల‌ను దగ్గుబాటి వెంకటేష్ తెలుగులో రీమేక్ చేసి హిట్టందుకున్నారు. అయితే ఇప్పుడా మూవీ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దృశ్యం 3 ఉండ‌బోతుంద‌ని ప్రక‌టించారు. తాజాగా దీనికి సంబంధించి అప్‌డేట్‌ను పంచుకున్నారు మోహ‌న్ లాల్.

ఈ సినిమా షూటింగ్ అక్టోబ‌ర్‌లో మొద‌లుకాబోతున్నట్లు ప్రక‌టించారు. గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండ‌దు అంటూ ఒక వీడియోను రిలీజ్‌ చేసారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌ పై ఆంటోని పెరుంబవూరు ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు.జీతూ జోసెఫ్‌ కథతో సంబంధం లేకుండా హిందీ వెర్షన్‌లో ‘దృశ్యం3’ ఉంటుందని అజయ్‌ దేవ్‌గన్‌ చెప్పడంతో చర్చ మొదలైంది. అజయ్‌ దేవ్‌గన్‌ కామెంట్లతో ఇటు మలయాళం, అటు హిందీలో వేర్వేరు కథలతో ‘దృశ్యం3’ వస్తుందని అంతా అనుకున్నారు. తాజాగా దర్శకుడు జీతూ జోసెఫ్‌ దీనిపై క్లారిటీ ఇచ్చారు. మలయాళంలో తాను రాసిన కథతోనే హిందీ, తెలుగు భాషల్లో ‘దృశ్యం-3’ వస్తుందని స్పష్టం చేశారు. హిందీ చిత్రం కూడా తను అందించిన కథతోనే తీయనున్నారనీ జీతూ జోసెఫ్‌ క్లారిటీ ఇచ్చారు. స్క్రిప్ట్‌ పని దాదాపు పూర్తయిందని ఫైనల్‌ టచెస్‌ ఇస్తున్నట్లు చెప్పారు. ఒకసారి పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధమైతే, హిందీ మూవీ టీమ్‌కు దానిని అందజేస్తా అన్నారు. అక్కడి కల్చర్‌, పరిస్థితులకు అనుగుణంగా వాళ్లు కొన్ని మార్పులు చేసుకుంటారని జీతూ జోసెఫ్‌ అన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

దారుణం.. అందరూ చూస్తుండగానే భర్తను కాల్చి.. భార్యాపిల్లల కిడ్నాప్ వీడియో

వీళ్లు మనుషులేనా? మురుగు గుంటలో కోడలిని పూడ్చి..లేచిపోయిందని ప్రచారం

వాచ్ చూడకుండానే టైమ్ చెప్పేస్తున్న బిచ్చగాడు వీడియో