దారుణం.. అందరూ చూస్తుండగానే భర్తను కాల్చి.. భార్యాపిల్లల కిడ్నాప్ వీడియో
మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ లవ్‌కుష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షుమేధి గ్రామంలో పట్టపగలే దారుణం జరిగింది. భార్య ముందే దుండగులు ఆమె భర్తపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో భర్త హరిరామ్ తీవ్రంగా గాయపడ్డాడు. దుండగులు అతని భార్య, బిడ్డలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. సంజయ్ సింగ్ రాజ్‌పుత్ అనే వ్యక్తి పది పదిహేను మంది గూండాలతో గ్రామానికి వచ్చాడు. ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి, అతడి భార్య, పిల్లలను కిడ్నాప్ చేశాడు. ఇంత జరుగుతున్నా గ్రామస్తులంతా చూస్తూ ఉండిపోయారు. గూండాలను అడ్డుకునే సాహసం ఎవరూ చేయలేకపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో కొంతమంది దుండగులు వచ్చి బాధితురాలి భర్తపై కర్రలతో దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తుంది. అనంతరం దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. తర్వాత మహిళను, ఆమె పిల్లలను బలవంతంగా కారులో ఎక్కించుకొని తమతో తీసుకెళ్లారు. ఇంత జరుగుతున్నా స్థానికులు ప్రేక్షక పాత్ర వహించారే తప్ప దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ భర్త హరిరామ్ పాల్ ను ప్రాథమిక చికిత్స తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి గల కారణం తెలియరాలేదు. సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. దీంతో బాధితుడి కుటుంబం పోలీసుల నుండి రక్షణ కోరింది. సంఘటనపై పోలీసులు కిడ్నాప్, హత్య కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
భార్య ముక్కు కొరికేసిన భర్త.. అందంగా ఉందని కాదు వీడియో
చీర కట్టినా..చివరికి దొరికిపోయాడు వీడియో
రోడ్డు మధ్యలో స్కూటీ ఆపి..దానిపైనే కునుకేసిన వ్యక్తి ! ఎక్కడంటే వీడియో

వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆశపడ్డ మహిళ.. కట్ చేస్తే..

‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. పోలీసులకు నేరస్తుడి వార్నింగ్

సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన వీధి కుక్క తో 15 రాష్ట్రాల యాత్ర

మనవళ్లే.. ఆ రైతన్నకు కాడెద్దులు వైరల్ వీడియో

ఫోన్ చూసీ.. చూసీ.. చివరికి ఒక వ్యక్తికి ఏమైందో తెలుసా?వీడియో

ఇదేంటి భయ్యా.. తాగకుండానే పాజిటివ్ వీడియో

తన భర్త మరో మహిళను చూడగానే ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?వీడియో
