భార్య ముక్కు కొరికేసిన భర్త.. అందంగా ఉందని కాదు వీడియో
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలను పెంచి పోషిస్తున్నారు. ఈ క్రమంలో అనేక దారుణాలకు సైతం పాల్పడుతున్నారు. తమ రిలేషన్ కి అడ్డుగా ఉన్నారని కొందరు పిల్లలు భార్య లేదా భర్త ప్రాణాలే తీసేస్తున్నారు. తాజాగా భార్య ప్రవర్తనపై అనుమానం కలిగిన ఓ వ్యక్తి ఆమెను ఫాలో అయ్యాడు. అది గమనించని అతడి భార్య రోజులాగే తన ప్రియుడిని కలిసేందుకు వెళ్ళింది. ప్రియుడితో తన భార్యను చూసిన భర్త కోపంతో ఆమె ముక్కు కోరికి పారేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హర్దోయి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళ తన ప్రేమికుడిని కలవడానికి వెళ్లింది. అనుమానంతో భర్త రాంఖిలవన్ ఆమెను వెంబడించి వెళ్ళాడు. చూస్తుండగానే భార్య ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అతడితో చనువుగా మెలగడం గమనించాడు. ఈ దృశ్యం చూడగానే రాంఖిలవన్ ఆగ్రహానికి గురి అయ్యాడు. ఆగ్రహం పట్టలేక పోయాడు. వెంటనే ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన భార్యను నిలదీశాడు. ఇద్దరి మధ్య తీవ్ర కలహం చోటుచేసుకుంది. కోపం పట్టలేక ప్రియుడు చూస్తుండగానే భార్య ముక్కును కోరికి పారేశాడు. బాధతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పోగయ్యారు. జరిగిన దారుణం గురించి పోలీసులకు సమాచారం అందించారు. ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం అవుతున్న మహిళను హర్దోయి మెడికల్ కాలేజీకి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం లక్నోలోని ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అదుపు ఎస్పీ నరేంద్రకుమార్ తెలిపారు. కేసును అన్ని కోణాల నుండి దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
జ్యుయలరీ షాపునకు వెళ్లిన 93 ఏళ్ల వృద్ధుడు..అతను అడిగింది విని యజమాని ఫిదా వీడియో
చిరుతకే ఝలక్ ఇచ్చిన గ్రామ సింహం..ఎలా తప్పించుకుందంటే వీడియో
వద్దు నాన్నా.. భయమేస్తోంది వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
