వద్దు నాన్నా.. భయమేస్తోంది వీడియో
తల్లిదండ్రులు చేసే పనులు ఒక్కోసారి పిల్లల ప్రాణాలమీదకు తెస్తాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ధైర్యవంతులుగా, అందరిలో ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు. ఈ క్రమంలో వారి ప్రవర్తన పిల్లలకు ఇబ్బంది పెట్టేవిధంగా ఉంటుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతను అసలు తండ్రేనా.. పిల్లాడ్ని స్వయంగా ప్రమాదంలోకి నెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి, దాదాపు మూడేళ్లు వయస్సు ఉండే తన కుమారుడిని తీసుకొని సింహం బోనులోకి వెళ్లాడు. సింహం వీపుపై ఆ చిన్నారిని కూర్చోబెట్టి ఫోటో తీయించడం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో బాలుడు భయంతో ఏడుస్తున్నాడు. అయినా ఆ తండ్రి అతని ప్రయత్నాన్ని ఆపలేదు.
చిన్నారి భయంతో ఏడుస్తుండటంతో కూర్చున్న సింహం ఒక్కసారిగా పైకి లేచింది. అందరూ సింహం వారిపై ఎటాక్ చేస్తుందని భావించారు. కానీ ఆ సింహం వారిని ఏమీ చేయలేదు. అనంతరం ఆ వ్యక్తి తన బాలుడిని తీసుకొని బయటకు వచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోప్ట్ చేస్తూ..”ఓ తండ్రి తన కొడుకును సింహంతో ఫోటో తీయించడానికి బలవంతం చేస్తున్నాడు” అని దానికి క్యాప్షన్ జోడించారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ ఘటన పేరెంటింగ్ బాధ్యతతో పాటు జంతు హింస అనే కీలక అంశాలపై తీవ్ర చర్చకు దారి తీసింది. తండ్రులు సాధారణంగా తమ కుమారులకు ఆదర్శంగా నిలుస్తూ వారి విలువలు, నమ్మకాలు, ప్రవర్తనలను ప్రభావితం చేస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భద్రతను గాలికొదిలేసి, ఇలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ‘అతడిని జైల్లో పెట్టాలి’ అని ఓ యూజర్ డిమాండ్ చేశాడు. మరికొందరు యూజర్లు జంతు హింస కోణాన్ని కూడా ప్రస్తావించారు. ‘పాపం ఆ సింహం. మనుషుల వినోదం కోసం ఏ జంతువుకూ మత్తు మందు ఇవ్వకూడదు’ అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎంత క్రూరత్వం! సింహం అడవిలో స్వేచ్ఛగా తిరగాలి కానీ, ఇలా ఫోటోలకు వస్తువుగా మారకూడదు. పాపం ఆ పిల్లవాడు కూడా’ అని మరో యూజర్ వ్యాఖ్యానించాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ ఎలా జరిగిందనేది క్లారిటీ లేదు.
మరిన్ని వీడియోల కోసం :
పాముకు ముద్దుపెట్టిన రైతు.. చివరకు వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
భర్త అంటే ఇష్టం లేని భార్య ఏం చేసిందో చూడండి వీడియో
మత్స్యకారుల వలలో విచిత్ర చేప… అపశకునం అంటూ భయాందోళనలు వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
