Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మత్స్యకారుల వలలో విచిత్ర చేప... అపశకునం అంటూ భయాందోళనలు వీడియో

మత్స్యకారుల వలలో విచిత్ర చేప… అపశకునం అంటూ భయాందోళనలు వీడియో

Samatha J
|

Updated on: Jun 22, 2025 | 8:15 PM

Share

తమిళనాడు సముద్ర తీరంలో ఓ అరుదైన, వింతైన చేప మత్స్యకారుల వలకు చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. మత్స్యకారుల వలలో పడిన అరుదైన చేపను చూసి అక్కడున్న వారంతా భయంతో వణికిపోయారు. వాళ్లేకాదు, స్థానికులంతా ఆ చేపను చూసి తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఆ చేప కనిపించింది అంటే ఏదో పెద్ద ప్రళయం తప్పదని భయపడుతున్నారు. సుమారు 30 అడుగుల పొడవున్న ఈ చేపను 'ఓర్ ఫిష్' అని పిలుస్తారు. సముద్ర గర్భంలో అత్యంత లోతులో ఈ చేప నివసిస్తుంది.

ఇది సాధారణంగా సముద్రం పైకి రావడం చాలా అరుదు. ఈ చేప కనిపించింది అంటే అరిష్టాలు తప్పవని కొన్ని దేశాల్లో నమ్ముతారు. ఈ చేప దర్శనం భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు సంకేతంగా విశ్వసిస్తారు. దీనిని ప్రళయ చేప అనికూడా పిలుస్తారు. జూన్‌ నెల ఆరంభంలో మత్స్యకారుల వలలో చిక్కిన ఈ ‘ప్రళయ చేప’ వార్త స్థానికులతో పాటు సోషల్ మీడియాలోనూ తీవ్ర భయాందోళనలకు దారితీసింది.ఈ చేప శాస్త్రీయ నామం రిగాలెకస్ గ్లెస్నే. (Regalecus Glesne) ఇది సముద్రంలో నివసించే అతిపెద్ద ఎముక గల చేప జాతుల్లో ఒకటి. ఇది సాధారణంగా సముద్రంలో 200 నుంచి 1,000 మీటర్ల లోతులో జీవిస్తుంది. ఈ చేప శరీరం సిల్వర్‌ కలర్‌లో మెరిసిపోతూ ఉంటుంది. తలపై ఉండే ఎర్రటి కిరీటం వంటి నిర్మాణంతో ఓ వింత ఆకారంలో ఉంటుంది ఈ చేప.

మరిన్ని వీడియోల కోసం :

సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో

యాంకర్‌ లైవ్‌ వార్తలు చదువుతుండగా..ఊహించని ఘటన వీడియో

ఆకాశంలో అద్భుతం.. విశ్వంలో ఉన్న బుల్లి గెలాక్సీల వీడియో