సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో
సముద్రంలో ఉండే తిమింగలాలు సొరచేపలు ఎంత ప్రమాదకరమైనవో తెలిసిందే. వాటిని చూస్తేనే ఎవరైనా భయపడిపోతారు. సముద్రంలో నివసించే జీవుల్లో సొరచేపలే అత్యంతం క్రూరమైనవి. సొర చేపలు తమ కత్తుల్లాంటి దంతాలతో ఏ జీవినైనా చీల్చి చెండాడేస్తాయి. కాబట్టి అలాంటి సొరచేపలు ఉన్న దగ్గరకు వెళ్లాలంటే వణికిపోతారు. కానీ ఓ యువతి ఏకంగా సముద్రంలో సొరచేపకే ముద్దు పెట్టింది. ఆ సొరచేప సైతం యువతిని ముద్దాడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది రియల్‌గా లేదు ఫేక్ వీడియో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
వీడియోలో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం. మెరైన్ బయాలిజ్ట్ అయిన యువతి తాహితి సముద్రతీరం వద్ద తన ప్రయోగం మొదలుపెట్టింది. 2018 నుండి సొరచేపలతో ఫ్రెండ్లీగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. సొరచేపలకు కూడా ఎమోషన్స్ ఉంటాయని చెప్పడానికి తాను ఈ ప్రమోషన్స్ చేస్తోంది. వీడియో ప్రకారం తాను స్నేహం చేసిన సొరచేపకు డాంటె అని పేరు కూడా పెట్టుకుంది. అంతే కాకుండా దానితో స్నేహం పెంచుకునేందుకు 30 నెలల సమయం పట్టినట్టు పేర్కొంది. 21 నెలలు దానిని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించగా ఆ తరవాత అది యువతి దగ్గరకు రావడం ప్రారంభించిందట. ఎలాంటి ఆహారం ఇవ్వకుండా మానవులకు సొరచేప ఆప్యాయంగా దగ్గరకు రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఎప్పుడు దాని వద్దకు వెళ్లినా సొరచేప ఆప్యాయంగా దగ్గరకు వచ్చి ముద్దాడుతుందనీ వీడియోలో యువతి రాసుకొచ్చింది. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో 1,105 రోజుల తరవాత తీసుకుందట. ఈ విషయం తెలిసి ఓషన్ ఎక్స్ ఇంకా బ్లూజోన్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు సైతం మెరైన్ బయాలజిస్ట్ యువతి ప్రయోగాన్ని హర్షిస్తూ పోస్ట్‌లు పెట్టారు. ఈ కథనం తెలుసుకున్న నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
మీ ఇంటిలోకి పాములు వస్తాయని భయపడుతున్నారా? ఈ మొక్కలు నాటి చూడండి!
ఇంటికి వచ్చిన భర్తకు ప్రేమగా మద్యం పోసిన భార్య తర్వాత ఊహించని ట్విస్ట్!
ఇప్పుడు నేను ఫుల్ హ్యాపీ ..ఆనందంలో సమంత వీడియో
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
