Andhra: చూశారా ఈ చిత్రం – పంచదార చిలకల మాదిరిగా మామిడి పండ్లు
కడప జిల్లా చక్రాయపేట మండలం ముద్దప్పగారి పల్లెలో ఓ విచిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్థానిక రైతు మూలంరెడ్డి సిద్ధారెడ్డి మామిడి తోటలో పంచదార చిలక ఆకారంలో రెండు మామిడి కాయలు పండడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. ఈ మామిడి కాయలు సాధారణ పండ్లలా కాకుండా, చిలక ముక్కు, తోక, రూపం వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి.
ఏపీలోని కడప జిల్లా చక్రాయపేట మండలం ముద్దప్పగారి పల్లెలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. స్థానిక రైతు మూలంరెడ్డి సిద్ధారెడ్డి మామిడి తోటలో కాసిన రెండు మామిడి కాయలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా మామిడి కాయలు గుండ్రంగా లేదా ఒంపుసొంపుగా ఉంటాయి. కానీ ఈ 2 మామిడి కాయలు పంచదార చిలక ఆకారంలో ఉండడం గమనార్హం. చిలక ముక్కు, తోక, రూపం లాగా కనిపించే ఈ కాయలను కోసి ఇంటికి తేవడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ అరుదైన ఫలాలను చూసిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వింత ఫలాలు చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొందరు ఆ రైతు ఇంటికి వస్తున్నారు. చిలక ఆకారంలో మామిడి కాయలు కనబడటంతో.. ఇది ప్రజలలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..

