Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్యుయలరీ షాపునకు వెళ్లిన 93 ఏళ్ల వృద్ధుడు..అతను అడిగింది విని యజమాని ఫిదా వీడియో

జ్యుయలరీ షాపునకు వెళ్లిన 93 ఏళ్ల వృద్ధుడు..అతను అడిగింది విని యజమాని ఫిదా వీడియో

Samatha J
|

Updated on: Jun 23, 2025 | 12:16 PM

Share

వివాహ బంధం విలువను చాటిచెప్పే అరుదైన ఘటన ఇది. తాళి కట్టి, జీవితాంతం కష్టసుఖాల్లో కలిసి మెలిసి జీవిస్తామని ప్రమాణం చేసి, ఏడడుగులు నడిచిన భర్త, లేదా భార్యను ఏడు రోజులు తిరక్కముందే హతమార్చేస్తున్న ఈ రోజుల్లో నిజమైన దాంపత్య దీవితానికి నిలువుటద్దంలా నిలిచారు ఈ వృద్ధ జంట. అవును వయసు పైబడినా ఒకరిపై ఒకరికి తరగని ప్రేమకు నిదర్శనంగా నిలిచారు. 93 ఏళ్ల భర్త తన భార్య కోసం మంగళసూత్రం కొనడానికి నగల దుకాణానికి వెళ్ళారు. వారి అన్యోన్యతకు ఫిదా అయిన‌ దుకాణ యజమాని నామమాత్రపు ధరకు దానిని అందించిన ఘటన అందరి హృదయాలను తాకింది.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని జాల్నా జిల్లా అంబోరా జహంగీర్ గ్రామానికి చెందిన నివృత్తి షిండే , ఆయన భార్య శాంతాబాయి వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. వీరు ఆషాఢ ఏకాదశి సందర్భంగా పండరీపురానికి కాలినడకన యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వృద్ధ జంట ఇటీవల ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఓ నగల దుకాణానికి వెళ్లారు. సంప్రదాయ పంచె, కుర్తా, తలపాగా ధరించిన నివృత్తి షిండే, ఆయన భార్యను చూడగానే దుకాణ సిబ్బంది పొరబడ్డారు. వారి వేషధారణ చూసి ఏదైనా ఆర్థిక సహాయం కోసం వచ్చారేమోనని భావించారు. అయితే, నివృత్తి షిండే తన భార్యకు మంగళసూత్రం కావాలని అడిగాడు. అది విని దుకాణ సిబ్బందితో పాటు యజమాని కూడా ఆశ్చర్యపోయారు. ఆ వయసులో భార్యపై ఆయనకున్న ప్రేమకు ముగ్దులయ్యారు. షిండే తన వద్ద ఉన్న 1,120 రూపాయలను యజమానికి అందించి, తన భార్యకు మంగళసూత్రం కావాలని కోరారు. ఆ వృద్ధుడి నిష్కల్మషమైన ప్రేమకు, వారి దాంపత్య బంధానికి అబ్బురపడిన దుకాణ యజమాని, వారి నుంచి కేవలం 20 రూపాయలను మాత్రమే తీసుకుని, మంగళసూత్రాన్ని వారికి బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఆయన “ఆ దంపతులు దుకాణంలోకి వచ్చారు.

మరిన్ని వీడియోల కోసం :

పాముకు ముద్దుపెట్టిన రైతు.. చివరకు వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

భర్త అంటే ఇష్టం లేని భార్య ఏం చేసిందో చూడండి వీడియో

మత్స్యకారుల వలలో విచిత్ర చేప… అపశకునం అంటూ భయాందోళనలు వీడియో