వాచ్ చూడకుండానే టైమ్ చెప్పేస్తున్న బిచ్చగాడు వీడియో
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన ప్రత్యేక సామర్థ్యంతో వాచ్ చూడకుండా టైమ్‌ను కచ్చితంగా చెప్పేస్తున్నాడు. సుఖ్ లాల్ తన ప్రత్యేక సామర్థ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. గడియారం, వాచ్, మొబైల్ ఇవేవీ చూడకుండా టైమ్ ను కచ్చితంగా చెప్పేస్తున్నాడు. పూర్వ కాలంలో గడియారాలు లేనప్పుడు ప్రజలు సూర్యుడి దిశను చూసి టైమ్‌ను అంచనా వేసేవారు.
అయితే ప్రస్తుత ఆధునిక యుగంలో కూడా సుఖ్ లాల్ అదే సంప్రదాయాన్ని సజీవంగా ఉంచాడు. అతను వాచ్ పెట్టుకోడు. మొబైల్ వాడడు. కానీ టైమ్ కచ్చితంగా చెప్పేస్తాడు. ప్రజలు తరచుగా అతనిని పరీక్షించడానికి టైమ్ ఎంతని అడుగుతుంటారు. ప్రతీసారి సుఖ్ లాల్ సరిగ్గానే చెబుతాడు. దీంతో ప్రజలు ఆశ్చర్యపోతుంటారు.బుర్హాన్‌పుర్ జిల్లా నేపానగర్ ప్రాంతంలో నివసిస్తున్న సుఖ్ లాల్‌ను స్థానికులు ‘నడిచే గడియారం’, ‘ వాకింగ్ క్లాక్ మ్యాన్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. 45 ఏళ్ల సుఖ్ లాల్ చిన్నప్పటి నుంచీ ఈ ప్రత్యేకమైన టాలెంట్‌ను కలిగి ఉన్నాడు. తన ప్రతిభను ‘ప్రకృతి గడియారం’గా వివరిస్తాడు సుఖ్ లాల్. ఈ గడియారం తనకు మాత్రమే కనిపిస్తుందని చెబుతుంటాడు.
మరిన్ని వీడియోల కోసం :
భార్య ముక్కు కొరికేసిన భర్త.. అందంగా ఉందని కాదు వీడియో
చీర కట్టినా..చివరికి దొరికిపోయాడు వీడియో
రోడ్డు మధ్యలో స్కూటీ ఆపి..దానిపైనే కునుకేసిన వ్యక్తి ! ఎక్కడంటే వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

