బల్లపై కాళ్లు పెట్టి..గురకపెట్టి గాఢ నిద్రలోకి టీచర్.. తరువాత..వీడియో
మహారాష్ట్రలోని జాల్నా జిల్లా గడేగావన్ గ్రామంలోని మరాఠీ మీడియం జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వీకే ముండే.. ఇటీవల తరగతి గదిలో సుమారు 15 నుంచి 20 మంది విద్యార్థులు పాఠాలు చదువుకుంటుండగా, ఆయన కుర్చీలో వెనక్కి వాలి.. కాళ్లు బల్లపై పెట్టి గురక పెడుతూ సుమారు 30 నిముషాలు గాఢ నిద్రలో మునిగిపోయారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్ తరగతి గదిలోనే విద్యార్థులందరూ ఉండగానే నిద్రపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సంచలనం సృష్టించింది. “మాస్టారు ఎంతసేపటి నుంచి నిద్రపోతున్నారు? అని ఓ విద్యార్థిని అడగ్గా.. అర గంట నుంచి అంటూ సమాధానం ఇవ్వడం వీడియోలో వినిపిస్తోంది. కాసేపటికి ఆ ఉపాధ్యాయుడు ఒళ్లు విరుచుకుంటూ నిద్ర లేచాడు. ఈ ఘటనపై జోనల్ విద్యాధికారి సతీష్ షిండేకు ఫిర్యాదు అందగా.. ఆయన స్పందిస్తూ.. సంఘటనపై విచారణ జరిపిస్తామని.. వాస్తవాలు తేలిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
భార్య ముక్కు కొరికేసిన భర్త.. అందంగా ఉందని కాదు వీడియో
చీర కట్టినా..చివరికి దొరికిపోయాడు వీడియో
రోడ్డు మధ్యలో స్కూటీ ఆపి..దానిపైనే కునుకేసిన వ్యక్తి ! ఎక్కడంటే వీడియో
ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్..
శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..
వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే
బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం
ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్
ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ పిడిగుద్దులు.. కారణం
