నాగార్జున కాళ్లు మొక్కేది.. ఆ ఒక్కడికే వీడియో
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం కుబేర. టాలీవుడ్ ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా, అక్కినేని నాగార్జున కీలక పాత్రలో మెరిశారు. జూన్ 20న రిలీజైన ఈ మూవీ తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. రెండు రోజుల్లోనే కుబేర సినిమా రూ 50 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. దీంతో చిత్ర బృందం సంతోషంలో మునిగి తేలుతోంది. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, అజయ్ కైకాల నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీకి రూ.120 కోట్ల వరకు ఖర్చు చేశారు.
జూన్ 23న సాయంత్రం హైదరాబాద్ లో కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కుబేర టీమ్‌కి ఆయన అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్.. నాగార్జున గురించి మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘సాధారణంగా నాగార్జున ఎవరి కాళ్లకు దండ పెట్టడు.. ఒక్కరికి తప్ప’ అంటూ ఎవరికీ తెలియని కొత్త విషయాన్ని చిరు వెల్లడించారు. ఇంతకూ నాగ్ ఎవరి కాళ్లకు దండం పెడతాడో కూడా చిరు చెప్పేశాడు. నిర్మాత సునీల్ నారంగ్ తండ్రి నారాయణ్‌దాస్ నారంగ్ అంటే నాగ్‌కు ఇష్టమని, అతడు కనిపిస్తే.. నాగ్ కాళ్లు మొక్కుతాడని చెప్పుకొచ్చాడు. తనకు కూడా నారాయణ్ దాస్ అంటే ఎంతో గౌరవమని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
దారుణం.. అందరూ చూస్తుండగానే భర్తను కాల్చి.. భార్యాపిల్లల కిడ్నాప్ వీడియో
వీళ్లు మనుషులేనా? మురుగు గుంటలో కోడలిని పూడ్చి..లేచిపోయిందని ప్రచారం

వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆశపడ్డ మహిళ.. కట్ చేస్తే..

‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. పోలీసులకు నేరస్తుడి వార్నింగ్

సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన వీధి కుక్క తో 15 రాష్ట్రాల యాత్ర

మనవళ్లే.. ఆ రైతన్నకు కాడెద్దులు వైరల్ వీడియో

ఫోన్ చూసీ.. చూసీ.. చివరికి ఒక వ్యక్తికి ఏమైందో తెలుసా?వీడియో

ఇదేంటి భయ్యా.. తాగకుండానే పాజిటివ్ వీడియో

తన భర్త మరో మహిళను చూడగానే ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?వీడియో
