Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్యారిస్‌ మ్యూజిక్ షోలో.. సిరంజిలతో దాడి వీడియో

ప్యారిస్‌ మ్యూజిక్ షోలో.. సిరంజిలతో దాడి వీడియో

Samatha J
|

Updated on: Jun 27, 2025 | 4:36 PM

Share

ప్యారిస్‌లో వీధి సంగీత ఉత్సవంలో టీనేజ్ అమ్మాయిలు సహా 145 మందిపై సిరంజిలతో దాడి ఘటనను పోలీసులు చేదించారు. ఈ ఘటనతో సంబంధమున్న12 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రపంచ సంగీత దినోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రసిద్ధ ఫేట్స్ డి లా మ్యూజిక్ షోలో గుర్తు తెలియని వ్యక్తులు 145 మందిని సిరంజీలతో పొడవడం ఫ్యాన్స్‌లో కలకలం రేపింది. శనివారం జరిగిన ఈ దాడిలో అనేక మంది ఆస్పత్రి పాలయ్యారు.

రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 12 మంది అనుమానితులను గుర్తించి విచారిస్తున్నారు. శనివారం ఫెటే డి లా మ్యూజిక్ కోసం లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు. ఈ క్రమంలో జనసమూహంలోకి చొరబడిన దుండగులు పలువురిపై సిరంజీలతో దాడి చేశారు. అయితే సిరంజీల్లో ఎలాంటి డ్రగ్స్‌ వినియోగించారనేదే ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది.ఘటనకు ముందు దుండగులు.. సామాజిక మాధ్యమాల్లో బాలికలను లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఫోన్ కాల్స్‌ను బట్టి పోలీసులు గుర్తించారు. బాలికలను స్పృహ కోల్పోయేలా చేసి, లైంగిక వేధింపులకు గురిచేయడానికి వాడే రోహిప్నోల్ లేదా GHB వంటి డేట్-రేప్ డ్రగ్స్‌ వంటివి ఆ సిరంజిల్లో వారు ఎక్కించటానికి ప్రయత్నం చేసి ఉండొచ్చనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

దారుణం.. అందరూ చూస్తుండగానే భర్తను కాల్చి.. భార్యాపిల్లల కిడ్నాప్ వీడియో

వీళ్లు మనుషులేనా? మురుగు గుంటలో కోడలిని పూడ్చి..లేచిపోయిందని ప్రచారం

వాచ్ చూడకుండానే టైమ్ చెప్పేస్తున్న బిచ్చగాడు వీడియో