భర్త చితికి నిప్పు పెట్టిన భార్య వీడియో
హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు స్మశానానికి వెళ్లడం గానీ, అంత్యక్రియల్లో పాల్గొనడం గానీ చేయకూడదంటారు. ఇలాంటి కట్టుబాట్లకు ఇప్పటికీ కట్టుబడి ఉంటున్నారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఆచార సంప్రాదాయాలను సైతం కొంత అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. కొన్ని చోట్ల మహిళలే అంతమి సంస్కారాలు నిర్వహిస్తున్నారు. వారసులు లేని తల్లిదండ్రులకు కూతుళ్లే తలకొరివి పెడుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి.
అలాంటి సంఘటనే బీహార్‌లోని ఖగారియా జిల్లాలో చోటు చేసుకుంది. కాకపోతే ఇక్కడ భర్తకు భార్య అంతిమ సంస్కారాలు నిర్వహించడం సంచలనంగా మారింది. హిందూ సంప్రదాయాలను బద్దలు కొడుతూ 50 ఏళ్ల మీనాదేవి అనే మహిళ తన భర్త అంత్యక్రియలు నిర్వహించింది. మీనా దేవి భర్త కృష్ణానంద అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. ఆ దంపతులకు పిల్లలు లేకపోవడంతో మీనానే తన బంధువుల సమక్షంలో అగేవాని గంగా ఘాట్‌లో తన భర్త చితికి నిప్పంటించారు. అంత్యక్రియల సమయంలో చేసే ఆచారాలన్ని పూర్తి చేసి ఈ తంతు నిర్వహించింది. “అంత్యక్రియల సమయంలో చేసే ఆచారాల గురించి నాకు తెలుసు. మన సాంప్రదాయ సమాజంలో ఒక మహిళ శ్మశానవాటికకు వెళ్లడం నిషేధించబడింది. కానీ, నా భర్త పట్ల నాకున్న సన్నిహిత ప్రేమ మరియు అనురాగం నాకు అంత్యక్రియలు నిర్వహించడానికి ధైర్యాన్ని ఇచ్చాయి. ఇది చాలా బాధాకరమైనది అయినప్పటికీ, నేను ముందుకు వచ్చాను” అని మీనా దేవి అన్నారు. పురుషాధిక్య సమాజంలో, అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు వచ్చే స్త్రీకి ఇది నిజంగా ఒక గొప్ప వేడుకగా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు అభినందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
దారుణం.. అందరూ చూస్తుండగానే భర్తను కాల్చి.. భార్యాపిల్లల కిడ్నాప్ వీడియో
వీళ్లు మనుషులేనా? మురుగు గుంటలో కోడలిని పూడ్చి..లేచిపోయిందని ప్రచారం

3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో

పరీక్షలో ఫెయిలయ్యాడని పొట్టుపొట్టుగా కొట్టిన తండ్రి.. కట్చేస్తే

ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో

విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకంటే?

అంతరిక్షంలో అంత్యక్రియలు.. అంతలోనే గంగపాలు వీడియో

సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
