Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాచ్ లర్స్‌.. ఇది మీ కోసమే వీడియో

బ్యాచ్ లర్స్‌.. ఇది మీ కోసమే వీడియో

Samatha J
|

Updated on: Jun 28, 2025 | 8:24 PM

Share

మన భారతీయులకు ‘జుగాడ్’ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందుబాటులో ఉన్న వస్తువులతోనే అద్భుతమైన, సృజనాత్మకమైన పరిష్కారాలను కనుగొనడంలో మనవాళ్లు సిద్ధహస్తులు. ఇలాంటి ‘జుగాడ్’ టెక్నిక్‌లు సమయాన్ని, డబ్బును, శ్రమను ఆదా చేస్తాయి. సోషల్ మీడియాలో ఇలాంటి జుగాడ్‌కు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా, ఓ మహిళ చేసిన అద్భుతమైన కిచెన్ జుగాడ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. చపాతీ కర్ర అందుబాటులో లేకపోవడంతో, ఆమె వినూత్నంగా పరోటాలు తయారుచేసింది. ఆమె ఐడియాకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈవీడియో ప్రకారం.. విదేశాల్లో చదువుకుంటున్న తన కుమారుడిని చూసేందుకు అతని తల్లి వెళ్లింది. ఆమె వంట చేద్దామని కిచెన్‌లోకి వెళ్లింది. ఆమె తన కుమారుడి కోసం పరోటాలు తయారు చేయ్యాలనుకుంది. అయితే చపాతీ చేసే కర్ర లేకపోవడంతో ఆ తల్లి ఏమాత్రం ఆలోచించకుండా..ఆలస్యం చేయకుండా అందుబాటులో ఉన్న ఓ ఖాళీ బీరు బాటిల్‌ తీసుకొని ఎంతో చాకచక్యంగా చకచకా పరోటాలు చేసేసింది. బాటిల్ బాడీతో పిండిపై నెమ్మదిగా ఒత్తిడి తెస్తూ పరోటాను సాఫీగా చేశారు. పరోటా కొంచెం పల్చగా అయ్యాక, దాని మధ్యలో బంగాళాదుంప కూర ముద్దను ఉంచి, అంచులను జాగ్రత్తగా మూసివేశారు. ఆ తర్వాత మళ్లీ బీర్ బాటిల్‌తోనే ఆ పరోటాను ఒత్తి, చివరగా పెనంపై వేసి కాల్చారు. ఈ మొత్తం ప్రక్రియను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తల్లి సమయస్పూర్తికి, క్రియేటివిటీకి హ్యాట్సాఫ్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. . కొందరైతే బీర్ బాటిల్‌ను వంటగదిలో వాడటానికి ఆ తల్లి ఎలా ఒప్పుకున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కామెంట్లలో కొందరు ఇలా స్పందించారు

మరిన్ని వీడియోల కోసం :

దృశ్యం 3’ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది..బ్లాక్ బ‌స్టర్ కాంబో రిపీట్‌..

నాగార్జున కాళ్లు మొక్కేది.. ఆ ఒక్కడికే వీడియో

ప్యారిస్‌ మ్యూజిక్ షోలో.. సిరంజిలతో దాడి వీడియో