Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుడమి తల్లికి రుతుచక్రం..కామాఖ్య తలుపులు ఆ 5 రోజులు మూసివేత వీడియో

పుడమి తల్లికి రుతుచక్రం..కామాఖ్య తలుపులు ఆ 5 రోజులు మూసివేత వీడియో

Samatha J
|

Updated on: Jun 28, 2025 | 8:23 PM

Share

అసోంలోని గువహటి‌లో ఉన్న కామాఖ్య మాత ఆలయం వేదికగా ‘అంబూబాచీ మేళా’ ప్రారంభమైంది. దీంతో ఆలయం తలుపులను పూజారులు మూసివేశారు. గురువారం వరకు ఆలయం తలుపులు మూసివేసి ఉంటాయి. జూన్ 26న తెల్లవారుజామున 3 గంటలకు కామాఖ్య మాత ఆలయంలో నివృత్తి పూజలను నిర్వహిస్తారు. ఆ వెంటనే అమ్మవారికి దేవీ స్నానం చేయించి, ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత గుడి తలుపులను తెరుస్తారు. అప్పటి నుంచి మళ్లీ భక్తులు కామాఖ్య మాతను దర్శించుకోవచ్చు.

 ఈ వివరాలను ఆలయ ప్రధాన పూజారి కబీంద్ర ప్రసాద్ శర్మ మీడియాకు తెలిపార. ఇంతకీ ఆలయం తలుపులను ఎందుకు మూసివేస్తారు. అనుకుంటున్నారా ? ఏటా జూన్ – జులై మధ్యకాలంలోనే గువహటిలో అంబూబాచీ మేళా జరుగుతుంటుంది. ఈ సమయంలోనే ఎందుకు అంటే యావత్ విశ్వ సృష్టికి కామాఖ్య మాతే కారకం అని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారిని యావత్ విశ్వానికే మాతగా భావిస్తారు. ఈ సమయంలోనే పుడమి తల్లికి రుతుచక్రపు దశ మొదలవుతుందని నమ్ముతారు. ఈ కారణం వల్లే జూన్, జులై నెలల్లో వ్యవసాయ కార్యక్రమాలకు భూమి అత్యంత అనువుగా ఉంటుందని అంటారు. పుడమి తల్లి రుతుచక్రపు దశలో ఉండే పరమ పవిత్రమైన రోజుల్లో జూన్ 22 నుంచి 26 వరకు ప్రత్యేక పూజలతో కామాఖ్య మాతను ప్రసన్నం చేసుకోవచ్చు అనేది భక్తుల విశ్వాసం. అందుకే అంబూబాచీ మేళాకు పెద్దఎత్తున భక్తజనం తరలి వస్తుంటారు.

మరిన్ని వీడియోల కోసం :

దృశ్యం 3’ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది..బ్లాక్ బ‌స్టర్ కాంబో రిపీట్‌..

నాగార్జున కాళ్లు మొక్కేది.. ఆ ఒక్కడికే వీడియో

ప్యారిస్‌ మ్యూజిక్ షోలో.. సిరంజిలతో దాడి వీడియో

Published on: Jun 28, 2025 08:23 PM