Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడేళ్లకే పీరియడ్స్.. క్యాన్సర్ అని 14 ఏళ్లు చికిత్స.. చివరికి

మూడేళ్లకే పీరియడ్స్.. క్యాన్సర్ అని 14 ఏళ్లు చికిత్స.. చివరికి

Samatha J
|

Updated on: Jun 29, 2025 | 3:24 PM

Share

ఆశ్చర్యకరమైన రీతిలో ఓ చిన్నారికి మూడేళ్ల వయస్సులోనే రుతుస్రావం ప్రారంభమయింది. ఆపై శారీరక పెరుగుదల ఆగిపోయింది. సరిగ్గా.. 8 ఏళ్లు రాగానే బాలిక అండాశయంలో కణిణి బయటపడగా, క్యాన్సర్ అనుకుని.. డాక్టర్లు ఆ కణితిని తొలగించారు. ఈ సమస్యలు కొనసాగుతుండగానే, తాజాగా, ఆమెను పరీక్షించిన జైపూర్ వైద్యులు..

ఆశ్చర్యకరమైన రీతిలో ఓ చిన్నారికి మూడేళ్ల వయస్సులోనే రుతుస్రావం ప్రారంభమయింది. ఆపై శారీరక పెరుగుదల ఆగిపోయింది. సరిగ్గా.. 8 ఏళ్లు రాగానే బాలిక అండాశయంలో కణిణి బయటపడగా, క్యాన్సర్ అనుకుని.. డాక్టర్లు ఆ కణితిని తొలగించారు. ఈ సమస్యలు కొనసాగుతుండగానే, తాజాగా, ఆమెను పరీక్షించిన జైపూర్ వైద్యులు.. ఆ 17 ఏళ్ల బాలిక.. ‘వ్యాన్ విక్ అండ్ గ్రుంబాచ్ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందని గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా థైరాయిడ్ గ్రంథి తీరు దెబ్బతిని, ఈ గ్రంథి స్రవించే హార్మోన్లు బొత్తిగా రిలీజ్ కాకపోవటం లేదా అతిగా రిలీజ్ అవుతాయని, బాలికలో కనిపించిన అసాధారణ లక్షణాలకు ఇదే కారణమని వైద్యులు వివరించారు. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంలో 60 మందిలోపే దీని బాధితులున్నారని డాక్టర్లు వెల్లడించారు.
17 ఏళ్లుగా ఎప్పుడూ డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నా.. ఏ డాక్టర్ కూడా ఈ బాలికకు థైరాయిడ్ టెస్ట్ చేయకపోవటంపై జైపూర్ వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనివల్లే.. ఈ వ్యాధి నిర్ధారణ లేటయిందని వారు తెలిపారు. నెలకు వెయ్యి రూపాయలు పెట్టి థైరాయిడ్‌కు మందులు వాడితే సరిపోయేదానికి.. 14 ఏళ్లలో అనవసర వైద్యాలు చేసి.. లక్షలు తగలేశారని వైద్యులు వాపోయారు. బాలికకు 15 రోజులపాటు సరైన చికిత్స అందించి, ఆమెను తాజాగా డిశ్చార్జ్ చేశారు.ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగవుతోంది. త్వరలోనే ఆ బాలిక సాధారణ స్థితికి చేరుకుంటుందని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. కాగా, క్యాన్సర్ అనుకుని ఏళ్ల తరబడి రోజూ చస్తూ బతికిన తమకు ఇంత మంచి కబురు చెప్పినందుకు బాలిక తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

పుడమి తల్లికి రుతుచక్రం..కామాఖ్య తలుపులు ఆ 5 రోజులు మూసివేత వీడియో

కరెంట్ పోల్ పైన పక్షి గూళ్లు .. ఆఫ్రికాలో అద్భుతం వీడియో

బ్యాచ్ లర్స్‌.. ఇది మీ కోసమే వీడియో