జూలై 5న ఏం జరగబోతుంది? బాబావంగా చెప్పినది వింటే గుండెల్లో వణుకు వీడియో
జూలై 5 వస్తుందంటేనే అక్కడ దడ పుడుతుంది. ఈసారి ఎలాంటి విపత్తు సంభవిస్తుందోననే ఆందోళన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పైగా జ్యోతిష్యులు చెప్పే అంచనాలు మరింత భయాందోళన రేకెత్తిస్తున్నాయి. జూలై 5, 2025న జపాన్‌లో పెను ప్రమాదం ముంచుకొస్తుందని ప్రఖ్యాత మాంగా కళాకారిణి రియో టాట్సుకి జోస్యం పలికారు.
న్యూ బాబా వంగా”గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టాట్సుకి అంచనాలతో జపాన్ పర్యాటక రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆమె భయానక అంచనాలు, పర్యాటకుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. రియో టాట్సుకి తన పుస్తకం “ది ఫ్యూచర్ ఐ సా”లో జూలై 5, 2025న జపాన్ నగరాలు సముద్రంలో మునిగిపోతాయని పేర్కొన్నారు. నీటి అడుగున సంభవించే పేలుడు, అగ్నిపర్వత విస్ఫోటనం దీనికి కారణం కావచ్చు. సముద్రం “మరుగుతున్నట్లు”, “భారీ బుడగలు” వస్తున్నట్లు ఆమె చూశారు. ఇది 2011 తోహోకు భూకంపం సృష్టించిన సునామీ కన్నా భారీదని, జపాన్ దక్షిణ తీరం, పరిసర ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య లోతైన సముద్ర పగులు పెను సునామీకి దారి తీస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ అంచనాలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. టాట్సుకి అంచనాలతో జపాన్‌కు వచ్చే విమాన బుకింగ్‌లు భారీగా రద్దయ్యాయి. జూన్ చివరి, జూలై తొలి వారాల్లో హాంకాంగ్ నుంచి జపాన్‌కు వెళ్లాల్సిన విమాన రిజర్వేషన్లు 83 శాతం పడిపోయాయి. పర్యాటకులు తమ జపాన్ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. ఈ విపత్తు సంభవించకపోయినా, పర్యాటక రంగంపై ఇప్పటికే తీవ్ర ప్రభావం పడింది. జూలై నెల కోసం ఆశగా ఎదురుచూస్తున్న జపాన్ పర్యాటక పరిశ్రమ, ఎలాంటి విపత్తు జరగకుండా ఉండాలని కోరుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం :
పుడమి తల్లికి రుతుచక్రం..కామాఖ్య తలుపులు ఆ 5 రోజులు మూసివేత వీడియో
కరెంట్ పోల్ పైన పక్షి గూళ్లు .. ఆఫ్రికాలో అద్భుతం వీడియో
బ్యాచ్ లర్స్.. ఇది మీ కోసమే వీడియో

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
