ఈ గున్న ఏనుగు డిసిప్లిన్ చూసి తీరాల్సిందే..వీడియో
సోషల్ మీడియాలో ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాస్తవానికి.. ఏనుగు సాధు స్వభావం గల జంతువు. అయితే, తనకు ఎవరైనా హాని తలపెడితే మాత్రం అది బీభత్సం సృష్టిస్తుంది. ఇక గున్న ఏనుగులు చూడ్డానికి ఎంతో ముద్దుగా ఉంటాయి. తమ చిలిపి చేష్టలతో తల్లిని విసిగించినా.. చూసే వారికి మాత్రం అవి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంటాయి. తాజాగా రోడ్డుపై వెళ్తున్న ఓ ఏనుగుల గుంపునకు చెందిన ఓ బుల్లి ఏనుగు చేసిన చేష్టల తాలూకూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైరల్ వీడియోలో.. కొన్ని ఏనుగులు రోడ్డుమీద వెళుతూ ఉండగా, వాటిలోని ఒక భారీ ఏనుగు మీద ఒక మావటి కూర్చుని ఉంటాడు. ఆ గుంపు వెనకే.. ఒక గున్న ఏనుగు పడుతూ లేస్తూ వెళుతూ కనిపిస్తుంది. అయితే, ఏనుగులకి సహజంగానే చెరుకు గడలంటే ఎంతో ఇష్టం కదా.. దీంతో.. ఆ గున్న ఏనుగు రోడ్డుమీద చెరుకు గడలు అమ్మే ఒక దుకాణాన్ని చూసి తడబడుతూ అక్కడికి వెళ్లింది. చిన్న పిల్లలు చాక్లెట్లు కొనుక్కోవటానికి వెళ్ళినప్పుడు.. ఫలానా చాక్లెట్ కావాలని ఎలా అక్కడి డబ్బాల వైపు చూపిస్తారా..సరిగ్గా.. మన గున్న ఏనుగు కూడా అక్కడున్న తాజా చెరుకు గడ వైపు తన చిట్టి తొండాన్ని చూపిస్తూ.. రిక్వెస్ట్ చేసింది. కళ్ల ముందే బోలెడు చెరుకు గడలున్నా.. వాటిని లాక్కొని తినకుండా బుద్దిగా.. తొండాన్ని చూపి.. రిక్వెస్ట్ చేస్తూనే నిలబడింది. ఒకవైపు, తన అమ్మ ఉన్న ఏనుగుల గుంపు దూరంగా వెళ్లిపోతుందనే కంగారు, మరోవైపు తియ్యటి చెరుకు గడ తినాలనే ఆశ.. ఈ రెండింటితో సతమవుతున్న ఆ బుల్లి ఏనుగు బాధ చూసిన ఆ దుకాణంలోని మహిళ.. బయటికొచ్చి మంచి చెరుకుగడను లాగి.. ఈ గున్న ఏనుగుకు ఇస్తుంది. దాన్ని తీసుకున్న ఆ గున్న ఏనుగు సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. ఆ చెరుకు గడను నములుకుంటూ.. బుడిబుడి నడకలతో తల్లి ఉన్న ఏనుగుల గుంపు వద్దకు పరుగుతీసింది. ఈ వీడియోను మాజీ IFS అధికారి సుశాంత నందా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గున్న ఏనుగు ప్రదర్శించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయిపోతూ ప్రశంసలు కురిపించారు.
మరిన్ని వీడియోల కోసం :
పుడమి తల్లికి రుతుచక్రం..కామాఖ్య తలుపులు ఆ 5 రోజులు మూసివేత వీడియో
కరెంట్ పోల్ పైన పక్షి గూళ్లు .. ఆఫ్రికాలో అద్భుతం వీడియో
బ్యాచ్ లర్స్.. ఇది మీ కోసమే వీడియో
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

