దీన స్థితిలో నటి పాకీజా.. ఆదుకోవాలని పవన్, బాబుకు విన్నపం
తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన కామెడీతో ఓ గురింపు తెచ్చుకుంది కమెడియన్ వాసుగి. ఈ పేరు చెబితే అసలే గుర్తుపట్టలేరు. కానీ పాకీజా అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. 1990 దశకంలో ఎన్నో సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. ముఖ్యంగా మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో పాకీజా పాత్రతో మరింత ఫేమస్ అయ్యారు. ఈ సినిమాలో ఆమె నటన ఇప్పటికీ అడియన్స్ మర్చిపోలేరు.
ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. పాకీజా పేరుతో సినీప్రియులకు దగ్గరైన ఆమె.. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూతో జనాల ముందుకు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆమె పూట గడవని పరిస్థితుల్లో భిక్షాటన చేసే పరిస్థితికి వచ్చారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఆమె తాజాగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు విజయవాడ వచ్చారు. ఈ క్రమంలోనే గుంటూరులో ఆమెను కొందరు మీడియ ప్రతినిధులు పలకరించగా.. తన కష్టాలను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు వాసుగి. తమిళనాడులో తనకు ఎవరూ సాయం చేయడం లేదని.. అందుకే ఏపీ ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను కలిసి తన సమస్య చెప్పుకోవాలని ఉందన్నారు. ప్రస్తుతం తనకు పూట గడవడమే కష్టంగా ఉందని..కొన్నిసార్లు భిక్షాటన చేయాల్సి వస్తుందని.. తన గురించి వీడియో తీసి తమిళ పరిశ్రమలోని ప్రముఖులకు పంపినప్పటికీ ఎవరూ స్పందించలేదని అన్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, మోహన్ బాబు కుటుంబాలు స్పందించి తనను ఆదుకున్నారని.. ఒకవేళ వారు స్పందించకపోతే ఎప్పుడో చనిపోయేదాన్ని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి తన గోడు వినిపించుకోవాలని ఉందని.. తనుక పింఛన్ సౌకర్యం కల్పిస్తే..వారి పేరు చెప్పుకుని బతుకుతానని ఎమోషనల్ అయ్యారు ఈమె.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇవే.. నా లైఫ్‌లో హ్యాపీడేస్.. పెళ్లి తర్వాత అఖిల్ మొదటి పోస్ట్!
రుద్ర క్యారెక్టర్.. ప్రభాస్ కాదు.. ఆ స్టార్ హీరో చేయాల్సింది
కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్..! విష్ణు దెబ్బకు రెబల్ స్టార్ విలవిల..

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
