ఇంటి మూలన చిన్న రంధ్రం నుండి వింత శబ్దాలు.. దగ్గర వెళ్లి చూసి ఖంగు తిన్నారు.
ప్రస్తుతం రెయినీ సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల అయితే కుండపోత వర్షం కురోస్తోంది. దీంతో కాలువలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు, వరదలకు జంతువులు, పాములు ఆవాసాలు కోల్పోయి జనావాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా ఓ పాము ఉత్తర్ ప్రదేశ్‌లో కొత్తగా నిర్మిస్తోన్న ఓ ఇంట్లోకి వచ్చి కన్నంలో నక్కింది. అంతేనా అక్కడ తనకు సేఫ్ అనుకుందో ఏమో గుడ్లు కూడా పెట్టేసింది.
దీంతో స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. అతను పామును, దాని గుడ్లను రక్షించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను 30 లక్షల మందికి పైగా వీక్షించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ మొదట రంధ్రం చుట్టూ ఉన్న మట్టిని తొలగించాడు. ఆ సమయంలో లోపల పాము ఉందని అనుమానించిన అతను రాడ్ సహాయంతో దానిని బయటకు తీసి జాగ్తత్తగా ఓ డబ్బాలో బంధించాడు. ఆపై గుడ్లను బయటకు తీసి ఓ జాడిలో జాగ్రత్తగా పెట్టాడు. ఈ స్నేక్ రెస్క్యూ ఆపరేషన్‌ను చూడటానికి స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ…ఇన్ని గుడ్లు పెట్టిన తర్వాత నాగుపాము ఎక్కడ దాక్కుంది, దాన్ని ఎలా రక్షించారు?” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. వీడియోపై యూజర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “నీ ధైర్యానికి సెల్యూట్ , నువ్వు నిజంగా ధైర్యవంతుడివి”, “మహాదేవ్ నిన్ను కాపాడుగాక” అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు “హ్యాండ్ గ్లౌజులు ధరిస్తే నీకు రిస్క్ ఉండదు” అని సలహా ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రెడిట్ స్కోరు లో తేడా వచ్చిందా ?? బతుకు బస్ స్టాండే.. ఎక్కడా అప్పు పుట్టదంతే
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

