Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్నప్ప సినిమాకు ప్రభాస్, మోహన్ లాల్,కాజల్,అక్షయ్‌ల దిమ్మ తిరిగే రెమ్యునరేషన్

కన్నప్ప సినిమాకు ప్రభాస్, మోహన్ లాల్,కాజల్,అక్షయ్‌ల దిమ్మ తిరిగే రెమ్యునరేషన్

Phani CH
|

Updated on: Jul 02, 2025 | 1:52 PM

Share

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందునుంచే ఈ సినిమాలోని అతిథి పాత్రలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, , యోగి బాబు, విష్ణు కూతుళ్లు ఇలా ఎంతో మంది ఈ సినిమాలో నటించారు.

అయితే ఈ స్టార్ నటులు కన్నప్ప సినిమాలో నటించినందుకు ఎన్ని కోట్లు అందుకున్నారని అందరిలో ఆసక్తి నెలకొంది. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘కన్నప్ప’. మహా భారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిపి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మించారు. సుమారు 300 కోట్ల రూపాయిలతో ఈ మూవీని నిర్మించినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కన్నప్ప సినిమా రిలీజ్ నేపథ్యంలో ఇందులో నటించిన స్టార్స్ ఎవరెవరు ఎంతెంత పారితోషికం తీసుకున్నారని అందరిలో ఆసక్తి నెలకొంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తొలి తెలుగు చిత్రం కన్నప్ప. ఈ చిత్రంలో నటించినందుకు అక్షయ్ కుమార్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. శివుడి పాత్రలో నటించినందుకు గానూ అతను ఆరు కోట్ల రూపాయలు అందుకున్నాడని తెలుస్తోంది. నటుడు మోహన్ లాల్ కూడా ఒక రోజు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నారు. కానీ ఈ సినిమాలో నటించినందుకు మోహన్ లాల్ ఎటువంటి పారితోషికం తీసుకోలేదని చెబుతున్నారు. ఈ సినిమాలో ఆయన ఉచితంగా నటించారు. భారతదేశంలో అత్యంత ఖరీదైన నటులలో ఒకరైన ప్రభాస్ కూడా ఈ సినిమాలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించారు. ప్రభాస్ ఈ సినిమా కోసం చాలా రోజులు పని చేశారు. ఇక సినిమాలో అతని స్క్రీన్ టైమ్ 30 నిమిషాలకు పైగా ఉన్నప్పటికీ ఎటువంటి పారితోషికం తీసుకోలేదీ పాన్ ఇండియా సూపర్ స్టార్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కంగారు కైకు.. కదులుతున్న రైలు ఎక్కబోయాడు.. చివరికి

ఇంటి మూలన చిన్న రంధ్రం నుండి వింత శబ్దాలు.. దగ్గర వెళ్లి చూసి ఖంగు తిన్నారు.

క్రెడిట్ స్కోరు లో తేడా వచ్చిందా ?? బతుకు బస్ స్టాండే.. ఎక్కడా అప్పు పుట్టదంతే