నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఎలా ?? పవన్ ఫ్యాన్స్‌లో హైటెన్షన్…
చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థియేటర్స్‌లోకి వస్తున్నారు. అందులోనూ ఓ పీరియాడిక్ పాన్ ఇండియా సినిమాలో పవర్ ఫుల్ రోల్లో కనిపిస్తున్నారు. అలాంటప్పుడు మేకర్స్ ఏ రేంజ్‌లో ప్రమోషన్స్ ప్లాన్ చేయాలి?. జనాల్లో ఏం రేంజ్‌లో కదలిక తీసుకురావాలి? తెలుగు టూ స్టేట్స్‌ను హరి హర టీజ్ కంటెంట్‌తో ఎలా ఊపేయాలి???...! కానీ.. అదే ఇప్పుడు మిస్సవుతోంది.
మేకర్స్ తీరు నిమ్మకు నీరెత్తినట్టే ఉందనే కామెంట్స్ పవర్ ఫ్యాన్స్ నుంచే వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా… క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్షన్లో… భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ హరి హర వీర మల్లు. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈసినిమా ఎట్టకేలకు జులై 24న రిలీజ్ కు రెడీ అయింది. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్ సరిగా చేయటం లేదనే కామెంట్స్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఈ రోజుల్లో ఓ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అంటే.. కనీసం 2 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలవుతాయి. కానీ, హరిహర వీరమల్లు విషయంలో సీన్ రివర్స్‌లో జరుగుతోంది. రిలీజ్‌కు ఇంకా నెల రోజులు కూడా లేదు.. అయినా కూడా ఇప్పటికీ ట్రైలర్ రాలేదు.. పూర్తిస్థాయి ప్రమోషన్స్ జరగట్లేదు. దీనిపై ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో.. మిగిలిన హీరోల సినిమాల్లా దీన్ని ప్రమోట్ చేయలేకపోతున్నారు. ఉన్న తక్కువ సమయాన్నే వీలైనంత వరకు వాడుకోవాలని చూస్తున్నారు మేకర్స్. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకను అప్పట్లో తిరుపతిలో ప్లాన్ చేసారు.. కానీ రిలీజ్ వాయిదా పడటంతో ఆగిపోయింది. కానీ నెక్ట్స్ కూడా అదే తిరుపతిలో భారీ ఎత్తున ఈ వేడుక చేయాలని చూస్తున్నారు. అలాగే చెన్నైతో పాటు ముంబైలోనూ ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఉన్న 25 రోజుల్నే జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దాంతో పాటు పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను టెన్షన్ కు గురిచేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: ఒక్కసారిగా.. తమ్ముడిని సర్‌ప్రైజ్ చేసిన మెగాస్టార్
ఇదేం రీల్స్ పిచ్చి.. 20 అంతస్థుల బిల్డింగ్ టెర్రస్‌పై నుండి మహిళ..??
లక్కీ భాస్కర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు.. 100 కోట్ల మూవీ రాసిపెట్టలేదు
కన్నప్ప సినిమాకు ప్రభాస్, మోహన్ లాల్,కాజల్,అక్షయ్‌ల దిమ్మ తిరిగే రెమ్యునరేషన్

వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆశపడ్డ మహిళ.. కట్ చేస్తే..

‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. పోలీసులకు నేరస్తుడి వార్నింగ్

సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన వీధి కుక్క తో 15 రాష్ట్రాల యాత్ర

మనవళ్లే.. ఆ రైతన్నకు కాడెద్దులు వైరల్ వీడియో

ఫోన్ చూసీ.. చూసీ.. చివరికి ఒక వ్యక్తికి ఏమైందో తెలుసా?వీడియో

ఇదేంటి భయ్యా.. తాగకుండానే పాజిటివ్ వీడియో

తన భర్త మరో మహిళను చూడగానే ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?వీడియో
