బేషరతుగా.. నన్ను క్షమించమని అడిగిన నితిన్.. కారణం..
ఇటీవల నితిన్ తనకు భీష్మ సినిమాలాంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు డైరెక్షన్ లో ఓ సినిమా చేశాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. రాబిన్ హుడ్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఇక ఇప్పుడు తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ఎందుకు రానున్నాడు.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, లయ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నితిన్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక పై మంచి సినిమాలు మాత్రమే చేస్తా అని ప్రామిస్ చేశారు. దాంతో పాటే తన ఫ్యాన్స్‌ను క్షమించమని అడిగాడు. ముగ్గురి కోసం తమ్ముడు సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నాడు నితిన్. దర్శకుడు వేణు శ్రీ రామ్.. తమ్ముడు సినిమా కోసం దాదాపు మూడేళ్లు కష్టపడ్డాడు. తనను ఇష్టపడే వాళ్ల కోసం ఈ సినిమా హిట్ అవ్వాలని, హీరోగా తనను అభిమానించే వాళ్ళ కోసం ఈ సినిమా హిట్ అవ్వాలని .. తనకు హిట్ వస్తే ఆనందపడే వాళ్లు.. ఫ్లాప్ వస్తే భాదపడేవాళ్ళ కోసం ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.. అన్నాడు నితిన్. తాను ఈ మధ్య చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.. దానికి మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నాను. ఇక పై మంచి సినిమాలు చేస్తానని ప్రామిస్ చేస్తున్నా.. తమ్ముడు సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని అనుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు నితిన్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఎలా ?? పవన్ ఫ్యాన్స్‌లో హైటెన్షన్…
Chiranjeevi: ఒక్కసారిగా.. తమ్ముడిని సర్‌ప్రైజ్ చేసిన మెగాస్టార్
ఇదేం రీల్స్ పిచ్చి.. 20 అంతస్థుల బిల్డింగ్ టెర్రస్‌పై నుండి మహిళ..??
లక్కీ భాస్కర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు.. 100 కోట్ల మూవీ రాసిపెట్టలేదు
కన్నప్ప సినిమాకు ప్రభాస్, మోహన్ లాల్,కాజల్,అక్షయ్‌ల దిమ్మ తిరిగే రెమ్యునరేషన్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

