డ్రైనేజీ నుండి వింత శబ్దాలు.. దగ్గరకి వెళ్లి చూసిన స్థానికులు పరుగో పరుగు
బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఒకేసారి అల్పపీడనాలు ఏర్పడ్డాయి. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం అల్పపీడనంగా బలపడింది. రుతుపవనాలు, అల్పపీడనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కాలువలు, నదులు పొంగిపొర్లుతున్నాయి.
దీంతో వరద ప్రవాహంతో నదుల్లో ఉండే మొసళ్లు జనావాసాల్లోని డ్రైనేజీల్లోకి కొట్టుకొస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామంలో మొసలి కలకలం సృష్టించింది. డ్రైనేజీలో ఏదో కదులుతున్నట్టుగా గుర్తించిన గ్రామస్తులు దగ్గరికెళ్లి లోపలికి తల పెట్టి చూశారు. అంతే.. అందులోని ఓ భారీ మొసలి ఒక్కసారిగా వారి మీదికి దూకేందుకు ప్రయత్నించింది. దీంతో.. భయంతో అక్కడి జనమంతా బిగ్గరగా కేకలు వేశారు. గ్రామానికి కొద్ది దూరంలోని బల్లకట్టు వాగు ప్రవాహం వల్ల, ఆ నీటి జాలుకి, ఈ మొసలి గ్రామం వైపు వచ్చి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే వారంతా.. మొసలి సమాచారాన్ని పంచాయతీ, అటవీశాఖ అధికారులకు అందించారు. దీంతో వెంటనే అటవీశాఖ అధికారులు వచ్చి, ఆ మొసలిని పట్టుకుని పాలెంవాగు జలాశయంలో వదిలి పెట్టటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కడుపునొప్పి అని ఆసుపత్రికి వెళ్లిన మహిళ.. అనుమానం తో టెస్ట్ చేయగా.. ఖంగు తిన్న డాక్టర్స్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

