Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు 360 సార్లు వాంతులు.. ఎందుకో తెలిస్తే షాక్‌! వీడియో

రోజుకు 360 సార్లు వాంతులు.. ఎందుకో తెలిస్తే షాక్‌! వీడియో

Samatha J
|

Updated on: Jul 03, 2025 | 11:06 AM

Share

ఓ నాలుగైదు సార్లు వాంతులు అయితేనే నీరసం వచ్చేస్తుంది. అలాంటిది గంటకు 15 సార్లు, అలా రోజుకు ఓ 300 నుంచి 360 సార్లు వాంతులు అయితే ఎలా ఉంటుంది. పాపం.. ఆ అమ్మాయి పరిస్థితి అదే. ఆమెకు గంటకు 15 సార్లు వాంతులు అవుతాయి. కారణం CVS అంటే సైక్లిక్ వామిటింగ్ సిండ్రోమ్. ఈ వ్యాధి స్త్రీలలో, మైగ్రేన్‌తో బాధపడేవారిలో అరుదుగా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారట. అమెరికాకు చెందిన షరిస్సే జెరూనియన్ ఈ వ్యాధితో బాధపడుతోంది.

ఈ వ్యాధిలో గంటకు 15 సార్లు కంటే ఎక్కువ వాంతులు వస్తాయని సినీ దర్శకురాలిగా పని చేస్తున్న ఆమె చెప్పింది. మానసిక ఒత్తిడి లేదా మైగ్రేన్ కారణంగా ఈ వాంతులు వస్తాయని వైద్యులు చెప్పారనీ అసలు వ్యాధిని నిర్థారించడంలో జాప్యం చేసి తనను డిప్రెషన్ రోగిగా అంచనా వేసారని తెలిపింది. 29 ఏళ్ల షరిస్సే జిరునియన్ కు ప్రారంభంలో వైద్యులు ఆమెకు మైగ్రేన్‌గా తప్పుగా నిర్ధారణ చేశారని ఆమె చెప్పింది. ఈ చికిత్స ఆమె ఆరోగ్యాన్ని మరింత దిగజార్చిందనీ ఈ కారణంగా ఆమె చాలాసార్లు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని వాపోయింది. పదే పదే వాంతుల వల్ల మానసికంగా బలహీనపడినట్లు చెప్పుకొచ్చింది బరువు కూడా తగ్గిపోయిందనీ ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందని చెప్పింది. రెండు సంవత్సరాల తర్వాత అంటే 2023లో తనకు సైక్లిక్ వామిటింగ్ సిండ్రోమ్ ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిసింది. అంత తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పటికీ, ఆమె తన సినిమా దర్శకత్వాన్ని వదులుకోలేదు. షరీస్సే జిరునియన్ “నథింగ్ సాలిడ్” అనే కామెడీ చిత్రాన్ని రచించి దర్శకత్వం వహించారు. “వామ్-కామ్” అనే చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. ఈ చిత్రం ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులను మానసికంగా స్ట్రాంగ్‌ చేసేందుకు ఆమె చేసిన ప్రయత్నంగా చెప్పవచ్చు.

మరిన్ని వీడియోల కోసం :

ముస్లిం సమాధి వద్ద ఆగే జగన్నాథుడి రథం..ఎందుకో తెలుసా?వీడియో

ఓవర్ థింకింగ్‌కు భగవద్గీత 5 పరిష్కారాలు వీడియో

ఆడుకుందామని గ్రౌండ్‌కి వెళ్లారు..అక్కడి కనిపించింది చూసి షాక్ వీడియో

శివాలయంలో అద్భుతం.. శివలింగంపై నాగుపాము వీడియో