శివాలయంలో అద్భుతం.. శివలింగంపై నాగుపాము వీడియో
తూర్పు గోదావరి జిల్లాలోని ఒక శివాలయంలో అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. శనివారం ఆలయంలోని లింగాభిషేకం జరుగుతుండగా ఆలయంలో ప్రవేశించిన ఒక భారీ సర్పం నేరుగా శివలింగం వద్దకు వెళ్లి అటు ఇటు తిరిగి శివలింగాన్ని చుట్టుకొని ఉండిపోయింది. ఈ ఊహించని దృశ్యాన్ని చూసిన భక్తులు ఉలికిపడిపోయారు.
తూర్పు గోదావరి జిల్లాలోని ఒక శివాలయంలో అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. శనివారం ఆలయంలోని లింగాభిషేకం జరుగుతుండగా ఆలయంలో ప్రవేశించిన ఒక భారీ సర్పం నేరుగా శివలింగం వద్దకు వెళ్లి అటు ఇటు తిరిగి శివలింగాన్ని చుట్టుకొని ఉండిపోయింది. ఈ ఊహించని దృశ్యాన్ని చూసిన భక్తులు ఉలికిపడిపోయారు. ఇది ఖచ్చితంగా ఆ శివయ్య మహిమేనని అన్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్ లోని శివాలయంలో ఈ ఆశ్చర్యకర ఘటన జరిగింది. భారీ సర్పం నేరుగా శివలింగాన్ని చుట్టుకొని ఉన్నదని చూసిన భక్తులు శంభో శంకర హరహర మహాదేవ అంటూ పరమేశ్వరుని స్తుతించారు. అభిషేకం పూర్తి కాగానే పూజారి హారతి ఇవ్వగా భక్తులు శంకనాదం చేశారు. సాధారణ భక్తుల వలే ఎలాంటి భయం లేకుండా నేరుగా వచ్చి పానవట్టం మీద కూర్చుని లింగాన్ని చుట్టుకున్న పామును భక్తులు వీడియో తీశారు. ఆ వీడియో నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
