Hyderabad: డ్రైవింగ్‌ అనేది బాధ్యతతో కూడిన పని.. బాధ్యత మరిచి వాహనం నడిపితే ఇలానే జరుగుతుంది – Watch Video

Road Accident: రోడ్లపై ప్రయాణం చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలా చేయడం వల్ల...

Hyderabad: డ్రైవింగ్‌ అనేది బాధ్యతతో కూడిన పని.. బాధ్యత మరిచి వాహనం నడిపితే ఇలానే జరుగుతుంది - Watch Video
Road Accident
Follow us

|

Updated on: Aug 03, 2021 | 6:55 PM

Road Accident: రోడ్లపై ప్రయాణం చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తమ ప్రాణాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. తమ బాధ్యతా రాహిత్యంతో కుటుంబాల్లో తీవ్ర విషాధాన్ని నింపుతున్నారు. ఫుల్లుగా మద్యం తాగి కొందరు, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించక మరికొందరు. ఇలా ఇతరుల ప్రాణాలను హరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కొన్ని రోడ్డు ప్రమాదాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు.

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లోని మోయినాబాద్‌లో చోటుచేసుకుంది. హైదరాబాద్‌ – చేవేళ్ల రహదారిపై ఓ ఆటో వెళుతోంది. ఇదే సమయంలో ఓ లారీ ఆటోను ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో వేగంగా దూసుకొచ్చింది. పక్క నుంచి వెళుతోన్న లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా ఆటోని పక్క నుంచి ఢీకోట్టాడు. దీంతో ఆటో ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. అంతటి ప్రమాదం జరిగినా కూడా డ్రైవర్‌ లారీ ఆపకుండా వెళ్లడం దారుణం. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పల్టీలు కొడుతోన్న సమయంలో ఆటో డ్రైవర్‌ తీవ్రంగా కుదుపులకు లోనవడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూస్తూంటే లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు.. ‘డ్రైవింగ్‌ అనేది ఒక బాధ్యతాయుతమైన పని. రోడ్డుపై వెళ్లే ఇతరులను కూడా చూడాలి’ అనే సందేశంతో కూడిన క్యాప్షన్‌ను జోడించారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజెన్లు సైతం సదరు లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ప్రమాదం గత నెల 27న జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: Usage of Ghee: ఆహారంలో నెయ్యి వాడటం వలన లాభాలున్నా.. పరిమితి మించితే ప్రమాదమే!

Jagan Government: జగన్ సర్కార్ తీపికబురు.. ఇకపై సచివాలయ ఉద్యోగులకు సీబీఏఎస్ పరీక్షలు లేనట్లే..

Twitter: తప్పుడు సమాచారం కట్టడికి ట్విటర్ కొత్త చర్యలు.. ఆ రెండు సంస్థలతో ఒప్పందాలు