Twitter: తప్పుడు సమాచారం కట్టడికి ట్విటర్ కొత్త చర్యలు.. ఆ రెండు సంస్థలతో ఒప్పందాలు

సమకాలిన అంశాలపై యూజర్లు సందర్భోచిత వివరణలను పొందే ఆస్కారం ఉంటుంది. దీని ద్వారా ట్విటర్‌లో వ్యాప్తి చెందుతున్న వార్తల్లో ఎంతవరకు నిజం..

Twitter: తప్పుడు సమాచారం కట్టడికి ట్విటర్ కొత్త చర్యలు.. ఆ రెండు సంస్థలతో ఒప్పందాలు
Twitter
Follow us
Javeed Basha Tappal

|

Updated on: Aug 03, 2021 | 5:28 PM

దేశంలో కొత్త ఐటీ చట్టాలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో తప్పుడు సమాచారం కట్టడికి మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ చర్యలు చేపట్టంది. ట్విటర్‌లో వచ్చే వార్తలను ధృవీకరించడానికి, ఆ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందన్న విషయాన్ని యూజర్స్‌కు వెల్లడించేందుకు సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్, అసోసియేటెడ్ ప్రెస్‌తో తాజాగా ఒప్పందాలు కుదుర్చుకుంది.  దేశంలో సమకాళిన అంశాలు, వివాదాస్పద అంశాల విషయంలో ట్విటర్ ద్వారా సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని సున్నితమైన అంశాల్లో జరుగుతున్న తప్పుడు సమాచార వ్యాప్తి వల్ల పలు చోట్ల అల్లర్లు చోటుచేసుకుంటున్న పరిస్థితి. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఇలాంటి తప్పుడు సమాచారం కట్టడికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాలు వీటిని తప్పని సరిగా అమలు చేయాలని, పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరంచడానికి రెడ్రసల్ టీంలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో సున్నితమైన అంశాలు, రాజకీయాలు, ఇతరత్రా అంశాలపై వచ్చే సమాచారంలో నిజానిజాలపై వివరణ ఇచ్చేలా సందర్భోచిత వివరణకు ట్విటర్‌ శ్రీకారం చుట్టింది.

ఏజెన్సీలతో ఒప్పందం అందులో భాగమే..

సదురు న్యూస్ ఏజెన్సీలతో కుదుర్చుకున్న ఒప్పందాలతో సమకాలిన అంశాలపై యూజర్లు సందర్భోచిత వివరణలను పొందే ఆస్కారం ఉంటుంది. దీని ద్వారా ట్విటర్‌లో వ్యాప్తి చెందుతున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్న విషయాన్ని యూజర్లు వెంటనే తెలుసుకోగలుగుతారు. కొత్త ఒప్పందాలతో తప్పుడు సమాచారం వైరల్ కాకముందే కట్టడి చేయవచ్చని ట్విటర్ అభిప్రాయపడింది.

Read also: Mosquito Control: మలేరియా దోమలపై బ్రహ్మాస్త్రం..ఇది ప్రయోగిస్తే దోమలు పరార్!

SBI yono Features: సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు ఎస్‌బీఐ మరో ముందడుగు.. యోనో యాప్‌లో కొత్త ఫీచర్‌..