Usage of Ghee: ఆహారంలో నెయ్యి వాడటం వలన లాభాలున్నా.. పరిమితి మించితే ప్రమాదమే!
మన దేశంలో ఆహారంలో నెయ్యి తీసుకోవడం చాలా ఎక్కువగా ఉంటుంది. కొందరు అన్నంలో నెయ్యి లేకుండా ముద్ద ముట్టరు. ముఖ్యంగా దక్షిణ భారతంలో ఈ అలవాటు చాలా ఎక్కువ.
Usage of Ghee: మన దేశంలో ఆహారంలో నెయ్యి తీసుకోవడం చాలా ఎక్కువగా ఉంటుంది. కొందరు అన్నంలో నెయ్యి లేకుండా ముద్ద ముట్టరు. ముఖ్యంగా దక్షిణ భారతంలో ఈ అలవాటు చాలా ఎక్కువ. ఇక పండుగలు వచ్చినపుడు చేసే పిండివంటల్లో నెయ్యి తప్పనిసరిగా ఉండాల్సిందే. నేతితో చేసిన స్వీట్లు ఎక్కువగా ఉపయోగిస్తారు ఆయా సందర్భాలలో. నేతి వినియోగంతో మంచితో పాటూ చెడూ ఉంటుంది. అదేవిధంగా పరిమితికి మించి తీసుకునే ఏ పదార్ధం అయినా ఆరోగ్యానికి ఇబ్బందులు తెస్తుంది. మరి నెయ్యిని కూడా పరిమితికి మించి తీసుకుంటే ప్రమాదం ఉంటుంది కదా? మరి రోజుకు ఒక మనిషి ఎంత పరిమాణంలో నెయ్యి తీసుకోవచ్చు అనే అంశం గురించి తెలుసుకుందాం.
నెయ్యి వలన ఉపయోగాలివీ..
నెయ్యి పిల్లలు, వృద్ధులకు మంచిది. ఉదాహరణకు, పిల్లల ఎత్తు, మానసిక వికాసాన్ని పెంచడంలో నెయ్యి సహాయపడుతుంది. అదే సమయంలో, ఇది వృద్ధులకు ఔషధంగా పనిచేస్తుంది. ఎందుకంటే, ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది. నడవడానికి ఇబ్బంది కలగకుండా బలాన్ని అందిస్తుంది. అదే సమయంలో, ఇది శరీరంలో అవయవాలు పని చేసే విధానంలో మెరుగుదలని కూడా తెస్తుంది. ఈ విధంగా నేటితో చాలా ఉపయోగాలున్నాయి.
నెయ్యి వలన ఇబ్బందులు ఇవీ..
నేతిని అధికంగా ఉపయోగిస్తే, కడుపులో నొప్పి రావచ్చు. ఊబకాయం కూడా పెరుగుతుంది. ధమనులలో కొవ్వు జమ కావచ్చు కూడా.
నిపుణులు ఏమి చెబుతారు
ఆహారంలో రుచిని పెంచడానికి నెయ్యిని ఉపయోగిస్తారు. మనం నెయ్యి మాత్రమే కాకుండా, వెన్నని కూడా ఆహారంలో ఉపయోగిస్తాము. భారతదేశంతో పాటు, ఇతర దేశాలలో వెన్న , నెయ్యి వాడకం పెరిగింది. నెయ్యి ఎంత ఉపయోగించాలనేది ఆహారం మీద ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతారు. ఉదాహరణకు, మీరు మిల్లెట్ బ్రెడ్ తినేటప్పుడు దానిలో కొంచెం ఎక్కువ నెయ్యి లేదా వెన్నని ఉపయోగించవచ్చు. పప్పు, రైస్ తింటున్నప్పుడు నెయ్యిని ఎక్కువగా వాడకండి. అవసరమైనంత ఎక్కువ ఆహారాన్ని వాడండి. ఎందుకంటే ఎక్కువ నెయ్యిని జోడించడం వల్ల ఆహార రుచి మారుతుంది. అదేవిధంగా అనారోగ్య కరకం కూడా అవుతుంది.
మీ పిల్లల ఆహారంలో నెయ్యిని ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. పిల్లల ఆహారంలో రెండు చెంచాల నెయ్యిని ఉపయోగించడం వల్ల వారి ఎదుగుదల,మానసిక వికాసం పెరుగుతుంది.
నెయ్యి పోషక విలువలు ఆయుర్వేదంలో తినడమే కాకుండా రోగాలను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. నెయ్యిలో విటమిన్ ఎ, ఇ మరియు డి పుష్కలంగా ఉన్నాయి. ఇది కాకుండా, ఒమేగా -3 లు, లినోలెయిక్ ఆమ్లం, బ్యూట్రిక్ యాసిడ్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఇంట్లో తయారుచేసిన నెయ్యి మాత్రమే వాడండి..
మీరు ఏ ఆవు లేదా గేదె పాలలో దీనినుంచి తీసిన నెయ్యిని అయినా ఉపయోగించవచ్చు. ఆవు పాలలోని నెయ్యి సాధారణంగా పిల్లలకు మరింత ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇంట్లో నెయ్యి మాత్రమే తినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే, మార్కెట్లో నెయ్యి స్వచ్ఛత ఉండదు. అది రసాయన రహితంగా ఉండే అవకాశం లేదు. నెయ్యిని చర్మంపై పూయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
ఏ ఆహార పదార్ధం అయినా మితంగా ఉన్నంత వరకూ ఫర్వాలేదు. అలాగే నెయ్యి కూడా. నెయ్యిని చాలా పరిమితంగా తీసుకోవడం ద్వారా అపరిమిత లాభాలు ఉన్నాయంటారు నిపుణులు. పరిమితి మించితే అదేస్థాయిలో చెడును కూడా చేస్తుందని చెబుతారు వారు.
Sleep Calculator: సుఖమైన నిద్ర ఆరోగ్యానికి మేలు.. ఏ వయసువారు ఎంత సమయం నిద్రపోవాలంటే