Sleep Calculator: సుఖమైన నిద్ర ఆరోగ్యానికి మేలు.. ఏ వయసువారు ఎంత సమయం నిద్రపోవాలంటే
Sleep Calculator: కొంతమంది ఎంత నిద్రపోయినా ఇంకా నిద్రపోవాలని కోరుకుంటారు. రాత్రి తగినంత విశ్రాంతి తీసుకున్నా పని చేసే సమయంలోనో లేదా మధ్యాహన సమయంలోనో..
Sleep Calculator: కొంతమంది ఎంత నిద్రపోయినా ఇంకా నిద్రపోవాలని కోరుకుంటారు. రాత్రి తగినంత విశ్రాంతి తీసుకున్నా పని చేసే సమయంలోనో లేదా మధ్యాహన సమయంలోనో నిద్రపోతుంటారు. అయితే ఒక మనిషికి ఎంత సమయంలో నిద్ర అవసరం అంటే.. అది వయసుని బట్టి ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. నిజానికి మనిషికి ఎన్ని గంటల నిద్ర కావాలో సమాధానం కరెక్ట్ గా తెలియని ప్రశ్నని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని మెడికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజ్ దాస్‌గుప్తా అన్నారు. నిద్ర అవసరాలు వ్యక్తగతం మీద ఆధారపడి ఉంటాయని .. అయితే రాత్రి 7 గంటల నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రపోయే దానిని స్వీట్ స్పాట్ అని అంటారని చెప్పారు
కొంతమందికి వయసుతో సంబంధం లేకుండా నిద్ర పట్టదు. ఇటువంటి వారు దీర్ఘకాలం తర్వాత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం , మానసిక వేదన వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకరోజు తక్కువ నిద్ర పోయినా దాని ప్రభావం తీవ్రంగా ఆరోగ్యపై పడుతుందని ఇటీవల అధ్యయనంలో తెలిసింది. ఇటువంటి వారు ఎక్కువగా ఆందోళన, డిప్రెషన్ , బైపోలార్ డిజార్డర్ వంటి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని దాస్‌గుప్తా చెప్పారు.
అయితే ఈ నిద్ర ప్రభావం పిల్లలలో కూడా అంటుంది. కొంతమంది పిల్లలు రోజంతా నిద్రపోతున్నట్లు కనిపిస్తారు. వారు చాలా వరకు అలాగే ఉంటారు.పిల్లలు మొదటి సంవత్సరంలో, పిల్లలు రోజుకు 17 నుండి 20 గంటలు నిద్రపోతారని దాస్‌గుప్తా చెప్పారు. 4 నెలల నుండి 12 నెలల శిశువులకు నిద్ర నుండి 12 నుండి 16 గంటల నిద్ర అవసరం. ఇక 1 నుంచి 3 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పసిబిడ్డలు 11 నుంచి 14 గంటల పాటు నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 3 నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 10 నుండి 13 గంటలు నిద్రపోవాలని, 6 నుండి 12 సంవత్సరాల వయస్సు వారు తొమ్మిది నుండి 12 గంటల వరకు నిద్రపోవాలని తెలిపారు. ఇక టీనేజర్స్ ఎనిమిది నుండి 10 గంటల నిద్ర పొందాలి
ఇలా తగిన సమయంలో తగినంత విశ్రాంతి నిద్ర తీసుకున్న యువత చురుకుగా ఉంటారని . వారిలో జ్ఞాపకశక్తి బాగుంటుందని తెలిపారు. మంచి నిద్రపోయినవారు అలసటకు దూరంగా ఉంటారు. కనుక టీవీ, సెల్ ఫోన్లు అంటూ నిద్ర పోకుండా ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని.. తగినంత విశ్రాంతి తీసుకుంటే అది ఆరోగ్యానికి మేలని వైద్య నిపుణులు తెలిపారు.
Also Read: జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ ఎలికాఫ్టర్‌కు ప్రమాదం.. సహాయం కోసం రంగంలోకి దిగిన ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం