Army Helicopter Crash: జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ హెలికాఫ్టర్‌కు ప్రమాదం.. సహాయం కోసం రంగంలోకి దిగిన ఎన్‌డి‌ఆర్‌ఎఫ్ బృందం

Army Helicopter Crash: జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. కథువా జిల్లాలో భారత ఆర్మీకి చెందిన ఓ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. రంజిత్ సాగర్ డ్యామ్ సరస్సు

Army Helicopter Crash: జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ హెలికాఫ్టర్‌కు ప్రమాదం.. సహాయం కోసం రంగంలోకి దిగిన ఎన్‌డి‌ఆర్‌ఎఫ్ బృందం
Army Helicopter Crash
Follow us

|

Updated on: Aug 03, 2021 | 1:42 PM

Army Helicopter Crash: జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. కథువా జిల్లాలో భారత ఆర్మీకి చెందిన ఓ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. రంజిత్ సాగర్ డ్యామ్ సరస్సు సమీపంలో భారత సైన్యం హెలికాప్టర్ కూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఎన్‌డి‌ఆర్‌ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. సహాయక చర్యలు చేపట్టింది. అయితే ఈ ప్రమాద సమయంలో హెలికాఫ్టర్ లో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ క్షేమంగా ఉన్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

సాధారణ శిక్షణ నిమిత్తం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ నుంచి బయల్దేరిన ఈ విమానం కథువా ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఆనకట్ట పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుండి 30 కి.మీ దూరంలో ఉంది. 254 ఆర్మీ ఏవియేషన్ హెలికాఫ్టర్ ఉదయం 10.20 కి బయలుదేరింది. సాగర్ డ్యాం ప్రాంతంలో లో లెవెల్ వెళ్తూ.. ఏలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాయి.ఈ ప్రమాదంపై ఆర్మీ ఉన్నతస్థాయి వర్గాలు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

Also Read: Indian American Girl: ప్రపంచంలోనే అత్యంత తెలివైన అమ్మాయిగా భారతసంతతికి చెందిన నటాషా