Weight Loss : బరువు తగ్గడానికి చిన్నప్పటి గేమ్ సూపర్‌గా పనిచేస్తుంది..! కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి..

Weight Loss : బాల్యంలో చాలామంది స్కిప్పింగ్ ఆడేవారు. కానీ ప్రస్తుత కాలంలో అది మెరుగైన ఫిట్‌నెస్‌ వ్యాయామం. మీరు అధిక బరువును

Weight Loss : బరువు తగ్గడానికి చిన్నప్పటి గేమ్ సూపర్‌గా పనిచేస్తుంది..! కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి..
Weight Loss 1
Follow us
uppula Raju

|

Updated on: Aug 03, 2021 | 3:34 PM

Weight Loss: బాల్యంలో చాలామంది స్కిప్పింగ్ ఆడేవారు. కానీ ప్రస్తుత కాలంలో అది మెరుగైన ఫిట్‌నెస్‌ వ్యాయామం. మీరు అధిక బరువును తగ్గించుకోవాలంటే స్కిప్పింగ్‌ బెటర్. గంటల తరబడి ఎక్సర్‌సైజ్ చేయలేనివారు స్కిప్పింగ్‌ ఒకటి చేస్తే సరిపోతుంది. అంతేకాదు మీకు చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తాయి. దీంతో మనస్సు తాజాగా ఉంటుంది. బరువు కూడా తగ్గుతారు.

1. కొన్ని నిమిషాలు స్కిప్పింగ్‌ చేయడం వల్ల చాలా కేలరీలు బర్న్‌ అవుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ వ్యాయామం. మీరు సమతుల్య ఆహారంతో స్కిప్పింగ్‌ చేస్తే బరువు సులువుగా తగ్గవచ్చు. అంతేకాకుండా ఎక్కువ సమయం కేటాయించనవసరం లేదు.

2. ఒక సాధారణ వ్యక్తి రోజూ కొంత సమయం స్కిప్పింగ్‌ ఆడితే శరీరంలో రక్త ప్రవాహం వేగవంతమవుతుంది. ఇది గుండెపోటు, ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మంచి కార్డియో వ్యాయామంగా పరిగణిస్తారు.

3. స్కిప్పింగ్‌ శరీరం సమతుల్యతను మెరుగుపరుస్తుంది. దీనితో పాటు శారీరక శక్తి పెరుగుతుంది. ఇది పాదాలకు మెరుగైన వ్యాయామంగా పరిగణిస్తారు. కండరాలు బలపడతాయి.

4. పిల్లల ఎత్తు గురించి ఆందోళన చెందుతుంటే రోజూ స్కిప్పింగ్‌ దూకడానికి ప్రోత్సహించాలి. దీని కారణంగా వెన్నెముక, వీపు, కాళ్ల కండరాలు సాగుతాయి. ఇది ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది.

5. స్కిప్పింగ్ మీ మనసుకు చాలా విశ్రాంతిని ఇస్తుంది. ఈ కారణంగా డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలు ఉండవు.

ఈ వ్యక్తులు చేయవద్దు..

1. మీకు ఆస్తమా వ్యాధి ఉన్నట్లయితే ఊపిరితిత్తులకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, నిపుణుల సలహా లేకుండా స్కిప్పింగ్‌ ఆడకూడదు.

2. అధిక రక్తపోటు ఉన్న రోగులు నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత స్కిప్పింగ్‌ ఆడాలి.

3. కీళ్ల నొప్పుల సమస్య ఉంటే స్కిప్పింగ్‌ ఆడవద్దు.

Welwitschia Plant : ముప్పై తరాలైన ఈ మొక్క ఎండిపోదు..! మీరెప్పుడైనా దీనిని చూశారా..?

PayDay Loan: మీకు శాలరీ రావడం ఆలస్యమవుతోందా.. రూ.లక్ష కావాలా.. కేవలం నెల రోజుల కోసం ఈ బ్యాంక్‌లో పే డే లోన్

Viral Pic: ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!