Health Tips : డయాబెటీస్ రోగులకు బెండకాయ దివ్యఔషధం..! ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి..
Health Tips : బెండకాయ కూరను అందరు ఇష్టపడి తింటారు. వీటితో రకరకాల వంటలు చేస్తారు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి.
Health Tips : బెండకాయ కూరను అందరు ఇష్టపడి తింటారు. వీటితో రకరకాల వంటలు చేస్తారు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. మధుమేహం, క్యాన్సర్ రోగులకు బెండకాయ ఒక సూపర్ ఫుడ్. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, కాల్షియం ఉంటాయి. ఇందులో తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటుంది. బెండ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
1. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరం బెండకాయను తినడం వల్ల ప్రారంభ దశలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక పరిశోధనలో బెండకాయ తినేవారిలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుందని తేలింది. టర్కీలో బెండ విత్తనాలను చాలా సంవత్సరాలుగా డయాబెటిస్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు.
2. ఫైబర్ అధికంగా ఉంటుంది బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహాన్ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది గ్లైసెమిక్ నియంత్రణను ప్రోత్సహిస్తుంది ఇన్సులిన్ ను కూడా మెరుగుపరుస్తుంది. ఫైబర్ ఉండటం వల్ల పొట్ట చాలా సేపు నిండినట్టు ఉంటుంది. ఆకలి త్వరగా ఉండదు. ఇది కాకుండా కడుపు సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.
3. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా కూడా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించడం ద్వారా ఈ వ్యాధిని నిర్మూలించవచ్చు.
4. కొలెస్ట్రాల్‌ని నియంత్రిస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది. అందువల్ల మనం తినే ఆహారంలో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. తద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.