Jagan Government: జగన్ సర్కార్ తీపికబురు.. ఇకపై సచివాలయ ఉద్యోగులకు సీబీఏఎస్ పరీక్షలు లేనట్లే..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ప్రొబేషన్ పీరియడ్ గురించి ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం...
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ప్రొబేషన్ పీరియడ్ గురించి ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ వెల్లడించారు. ఇకపై ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే డిపార్ట్‌మెంటల్ పరీక్షలు మాత్రమే ఉంటాయని ఓ ప్రకటన ద్వారా ఆయన తెలియజేశారు.
సీబీఏఎస్(Credit Based Assessment System) పరీక్షలతో పాటు మిగతా ఇతర అదనపు పరీక్షలు ఉద్యోగులకు నిర్వహించబోమని స్పష్టం చేశారు. 2019 అక్టోబర్ 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఏర్పాటు చేశారని.. అప్పటి నుంచి రెండేళ్లు పూర్తి చేసుకున్న 1.34 లక్షల మంది ఉద్యోగులంతా కేవలం డిపార్టుమెంటల్ పరీక్షలు పాసైతే చాలు అని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ క్లారిటీ ఇచ్చారు.
Also Read:
భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!
నడిరోడ్డుపై యువతి హాల్‌చల్.. వ్యక్తిని ఎగిరెగిరి కొడుతూ రచ్చ.. హ్యష్‌ట్యాగ్ ట్రెండింగ్!
కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఈ ఫోటోలో ఏ జీబ్రా ముందుకు ఉంది.? మొత్తం ఎన్ని ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!