Viral Pic: ఈ ఫోటోలో ఏ జీబ్రా ముందుకు ఉంది.? మొత్తం ఎన్ని ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
సవాళ్లు, పజిల్‌లు, ఆప్టికల్ ఇల్యుషన్స్ ఇలా ఏదైనా కూడా సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిని సాల్వ్ చేయడంలో...
సవాళ్లు, పజిల్‌లు, ఆప్టికల్ ఇల్యుషన్స్ ఇలా ఏదైనా కూడా సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిని సాల్వ్ చేయడంలో నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తారు. అలాంటి ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది కొంచెం పాతదే అయినా మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆఫ్రికాలోని మసైమారాలో ప్రముఖ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ సరోష్ లోధి తీసిన జీబ్రాస్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Let’s see who can tell which Zebra is in front. Clicked & asked by friend @saroshlodhi. pic.twitter.com/RNAMBJrk1K
— Parveen Kaswan (@ParveenKaswan) July 8, 2020
సరోష్ లోధి తీసిన ఈ జీబ్రాస్ ఫోటోని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇందులో ఏ జీబ్రా ముందు నిలబడి ఉందో కనిపెట్టండి అంటూ నెటిజన్లను పజిల్ విసిరాడు. ఇక ఈ పజిల్‌కు సంబంధించిన సరైన సమాధానాన్ని కనిపెట్టేందుకు నెటిజన్లు బుర్రలు పట్టుకున్నారు.
The one on the right….Going by shadow
— Omkar (@Omkar2264) July 8, 2020
ఆ పిక్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నా.. జనాలు మాత్రం ఆన్సర్ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఆ ఫోటోలో ఉన్నది రెండు కాదు మూడు జీబ్రాస్ అని చెబుతున్నారు. ఇది ఫోటోషాప్ మ్యాజిక్ మాత్రం కాదని సదరు ఫారెస్ట్ ఆఫీసర్ స్పష్టం చేశారు. సమాధానం ఏదైనా కూడా నెటిజన్లు మాత్రం ఫోటోగ్రాఫర్ ప్రతిభకు కామెంట్స్ రూపంలో ప్రశంసలు కురిపించారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేయండి..!
Seems like head of a 3rd zebra standing in middle.?
— Samy ?????? (@SamAllbd) July 8, 2020
Also Read:
భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!
నడిరోడ్డుపై యువతి హాల్‌చల్.. వ్యక్తిని ఎగిరెగిరి కొడుతూ రచ్చ.. హ్యష్‌ట్యాగ్ ట్రెండింగ్!
కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!