పాపం శునక వేదన.. ఎరక్కపోయి ఇరుక్కుపోయింది..! ఆ తిప్పలు చూడాలి..
గత మూడు రోజులుగా నీళ్లు, ఆహారం లేక నీరసంతో రోడ్ల వెంట తిరుగుతుంది. అసలే ఎండలు మండుతున్నాయి. తమ లాంటి మూగ జీవుల రోదన పట్టించుకునే వాళ్ళు లేరని..డబ్బాలో ఇరుక్కున్న తలతోనే వీధుల వెంట తిరుగుతుంది. ఈ ఎండల్లో ఆహారం,నీరు అందక ఆ మూగ జీవి పరిస్థితి ఏమవుతుందోనని జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

ఎండలు మండిపోతున్నాయి. దాహంతో మనుషులే కాదు.. పశుపక్షాదులు కూడా గొంతు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలందరూ కూల్‌డ్రింక్స్, కొబ్బరి బోండాలు, చెరుకు రసం, జ్యూస్ బండ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే దాహం తీర్చుకునేందుకు ఓ నోరులేని శునకం పాపం దిక్కుతోచని స్థితిలో పడింది. నీళ్ల కోసం ఎర్రక్కపోయిన ఆ కుక్క..అక్కడే ఇరుక్కుపోయింది. గత మూడు రోజులుగా నీళ్లు, ఆహారం లేక నీరసంతో రోడ్ల వెంట తిరుగుతుంది. నీళ్ళు తాగుదామని ప్లాస్టిక్ డబ్బాలో తల పెట్టి కుక్క పాపం లబోదిబో మంటూ వీధుల్లో తిరుగుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే…
ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఓపెన్ కాస్ట్ సింగరేణి గనుల కారణంగా వేసవిలో రోజు రోజుకు ఉష్ణోగ్రత తీవ్రంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సత్తుపల్లి పట్టణంలోని రాజీవ్ కాలనిలో ఒక కుక్క మండుటెండలో దాహం తీర్చుకునేందుకు ప్లాస్టిక్ డబ్బాలో తల పెట్టింది.. నీళ్ళు తాగేసి దాహం తీర్చుకుంది కానీ, ఎరక్కపోయి…ఇరుక్కున్నట్లుగా… ఆ కుక్క తల ప్లాస్టిక్ డబ్బాలో ఇరుక్కుపోయింది. తల ప్లాస్టిక్ డబ్బాలో ఇరుక్కుపోవడంతో మూడు రోజులుగా నీళ్లు, తిండి లేక రోడ్ల వెంట ఇలా పరుగులు తీస్తోంది.
వీడియో ఇక్కడ చూడండి..
అసలే ఎండలు మండుతున్నాయి. తమ లాంటి మూగ జీవుల రోదన పట్టించుకునే వాళ్ళు లేరని..డబ్బాలో ఇరుక్కున్న తలతోనే వీధుల వెంట తిరుగుతుంది. ఈ ఎండల్లో ఆహారం,నీరు అందక ఆ మూగ జీవి పరిస్థితి ఏమవుతుందోనని జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




