Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం

అహ్మదాబాద్ విమాన ప్రమాదం

అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం జూన్ 12, 2025 గురువారం కుప్పకూలింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అహ్మదాబాద్‌-లండన్‌ ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. ప్రయాణికులు, కేబిన్‌ క్రూలో ఒక్కరు తప్ప అందరు మరణించారు. ఏఐ171 విమానంలో ప్రయాణించిన 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. మృతుల్లో 229 మంది పాసింజర్స్ కాగా.. 12 మంది సిబ్బంది అని వెల్లడించింది. 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ పౌరులు, ఏడుగురు పోర్చగీస్‌ వాసులు, ఒకరు కెనడాకు చెందినవారు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. భారత విమానయాన చరిత్రలోనే, ఇది అత్యంత ఘోరమైన ప్రమాదం. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం భారత ప్రధాని మోదీ.. ఘటనాస్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బాధితులను పరామర్శించారు.

ఇంకా చదవండి

Begumpet Airport: బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌ను తరలించండి.. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భయాందోళన..

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత.. దేశంలోని ఎయిర్ పోర్టుల సమీపంలో నివాసం ఉండే ప్రజలు వణికిపోతున్నారు. సాధారణంగానే ఫ్లైట్స్ టేకాఫ్‌, ల్యాండింగ్ సమయంలో పెద్ద శబ్దం చేస్తుంటాయి. ఈ సమయంలో ఎయిర్ పోర్ట్ సమీపంలో నివాసం ఉండే వాళ్ల పరిస్థితి వర్ణనాతీతం. ఇక.. అహ్మదాబాద్‌ ప్రమాదం తర్వాత.. ఎయిర్‌పోర్టుల సమీపంలో ఉండాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది.

ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తులో కీలక పురోగతి.. బ్లాక్ బాక్స్‌లో ఉన్నదేంటి?

జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తూ కూలిపోయిన AI 171 విమాన ప్రమాద దర్యాప్తు గురించి కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక విషయాలను వెల్లడించింది. విమాన ప్రమాద దర్యాప్తు బ్లాక్ బాక్స్ డేటా రికవరీ పూర్తయింది. డేటా విశ్లేషణపై AAIB దర్యాప్తు బృందం పనిచేస్తుందని ప్రకటన విడుదల చేసింది. ICAO చికాగో కన్వెన్షన్ (1944) , విమాన ప్రమాద దర్యాప్తు నియమాల ప్రకారం AI 171 విమాన ప్రమాద దర్యాప్తు కొనసాగుతుందని తెలిపింది

Ahmedabad AI Crash: మెడికోల కుటుంబాలకు అండగా UAE డాక్టర్ షంషీర్.. రూ.6 కోట్ల సాయం అందజేత..

ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం.. BJ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడటంతో దాదాపు 34 మంది మెడికోలు సైతం మరణించారు.. అయితే.. మెడికోల కుటుంబాలను ఆదుకునేందుకు యూఏఈ వైద్యుడు ముందుకొచ్చాడు.. UAEకి చెందిన డాక్టర్ షంషీర్ వాయాలిల్ రూ.6 కోట్లు (2.5 మిలియన్ దిర్హాంలు) ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

టెన్షన్.. టెన్షన్.. చెన్నైకు బయలుదేరిన విమానం.. ఇంతలోనే పైలట్ మేడే కాల్.. చివరకు

వరుస విమాన ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా.. ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.. 168 మంది ప్రయాణికులతో గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో తగినంత ఇంధనం లేదని ఫ్లైట్ పైలట్ మేడే కాల్ చేశారు..

హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన 7 విమానాల రద్దు.. కారణం అదేనా?

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటన తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)దేశవ్యాప్తంగా విమానయాన భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం తర్వాత ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో విమాన కంపెనీలు అనేక విమానాలను గ్రౌండ్ చేయాల్సి వచ్చింది.

Air India Crash: విమాన ప్రమాదంలో బంగారం, డబ్బు స్వాధీనం.. హక్కుదారులకు ఇవ్వడం సాధ్యమేనా?

జూన్ 12న అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ఏఐ-171 విమానం కూలిపోయిన తరువాత అధికారులు ఆ శిథిలాల నుంచి అనేక విలువైన, వ్యక్తిగత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 70 తులాల బంగారు ఆభరణాలు (సుమారు 800 గ్రాములు), రూ. 80,000 నగదు, భగవద్గీత కాపీ, పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వస్తువులను వాటి నిజమైన హక్కుదారులను ఎలా గుర్తిస్తారనే అనుమానం అందరికీ ఉంటుంది.

  • Srinu
  • Updated on: Jun 21, 2025
  • 2:49 pm

Ahmedabad Plane Crash: ఆశలు ఆవిరి.. దర్శకుడి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతం.. విమాన ప్రమాదంలో చనిపోయినట్లు నిర్ధారణ

ఈ ట్యాలెంటెడ్ దర్శకుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పలు మ్యూజిక్ వీడియోలను తెరకెక్కించి మన్ననలు అందుకున్న ఈ డైరెక్టర్ ఇక తిరిగి రాడని తెలిసి అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అలాగే సంగీతాభిమానులు సోషల్ మీడియా వేదికగా అతనికి నివాళి అర్పిస్తున్నారు.

ఎయిర్ ఇండియాను వెంటాడుతున్న ప్రమాదాలు.. ఫ్లైట్‌ను ఢీకొట్టిన పక్షి.. అత్యవసర ల్యాండింగ్!

పూణే నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI2470 ఒక పక్షితో ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమై ఫైలట్, పూణేలో సురక్షితంగా దించారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేసి, ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది ఎయిర్ ఇండియా సంస్థ. విమానాన్ని తనిఖీ చేసిన అనంతరం పునరిద్దరిస్తామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Watch Video: సోదరుడి అంత్యక్రియల్లో కన్నీరుమున్నీరైన రమేశ్‌ విశ్వాస్‌.. వీడియో

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్‌ కుమార్‌ రమేశ్‌ తన సోదరుడి అంత్యక్రియలకు హాజరయ్యారు. డయ్యూలో రమేశ్‌ సోదరుడు అజయ్‌ అంత్యక్రియలు జరిగాయి. విమాన ప్రమాదంలో అజయ్‌ చనిపోగా ఆయన సీటు పక్కనే కూర్చున్న రమేశ్‌ మాత్రం ప్రాణాలతో బయపటపడ్డారు.

అమ్మ బాబోయ్ ఎయిర్ ఇండియా..! మరో ఫ్లైట్ రద్దు.. 24 గంటల్లో 5 విమానాల్లో సాంకేతిక సమస్యలు!

భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన మరో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మంగళవారం (జూన్ 17) ఢిల్లీ నుండి పారిస్‌కు వెళ్లే ఈ విమానాన్ని ఎయిర్ ఇండియా రద్దు చేసింది. విమానంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయని, అందువల్ల విమానం రద్దు చేయడం జరిగిందని కంపెనీ పేర్కొంది. టెక్నికల్ ఇష్యూస్ పరిష్కరించి, ప్రయాణికులకు సమాచారం ఇస్తామని తెలిపింది.