AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెన్షన్.. టెన్షన్.. చెన్నైకు బయలుదేరిన విమానం.. ఇంతలోనే పైలట్ మేడే కాల్.. చివరకు

వరుస విమాన ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా.. ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.. 168 మంది ప్రయాణికులతో గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో తగినంత ఇంధనం లేదని ఫ్లైట్ పైలట్ మేడే కాల్ చేశారు..

టెన్షన్.. టెన్షన్.. చెన్నైకు బయలుదేరిన విమానం.. ఇంతలోనే పైలట్ మేడే కాల్.. చివరకు
Indigo Flight
Shaik Madar Saheb
|

Updated on: Jun 21, 2025 | 6:58 PM

Share

వరుస విమాన ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా.. ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.. 168 మంది ప్రయాణికులతో గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో తగినంత ఇంధనం లేదని ఫ్లైట్ పైలట్ మేడే కాల్ చేశారు.. రేడియో కమ్యూనికేషన్ ద్వారా పైలట్ డిస్ట్రెస్ కాల్ చేయడంతో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగినట్లు అధికారులు తెలిపారు. గౌహతి నుంచి సాయంత్రం 4:40 గంటలకు ఇండిగో విమానం 6E-6764 (A321) బయలుదేరింది.. ఈ క్రమంలో పైలట్ సాయంత్రం 7:45 గంటలకు చెన్నైలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కుదరలేదని.. వెంటనే దాన్ని బెంగళూరుకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

శుక్రవారం సాయంత్రం చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో ఇంధన అత్యవసర పరిస్థితి తలెత్తడంతో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యిందని అధికారులు తెలిపారు. ఇండిగో విమానంలో 168 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ విమానం చెన్నైకి చేరుకుంది కానీ రద్దీ కారణంగా ల్యాండ్ కాలేదు. దీని తరువాత, పైలట్ ఇన్ కమాండ్ బెంగళూరుకు మళ్లించి ఇంధన అత్యవసర కాల్ (ఇంధన అత్యవసర కాల్) ఇచ్చాడని, అనంతరం విమానం సేఫ్ గా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యవసర కాల్ వచ్చిన తర్వాత, ATC ఆన్-గ్రౌండ్ సిబ్బందిని అప్రమత్తం చేసింది.. ఈ క్రమంలో విమానం రాత్రి 8.20 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు.

కాగా.. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ కూలిపోవడానికి కొద్దిసేపటి ముందు పైలట్ మేడే కాల్ చేశారు. కాగా.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 279 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం.. హాస్టల్ భవనంపై పడటంతో 35 మంది మెడికోలు మరణించారు.. ఈ ఘటన మరువక ముందే.. ఇలాంటి ప్రమాదాలు వెంటాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..