AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోరుకున్నవాడిని కట్టుకుంది.. పెళ్లైన ఆరు రోజులకే విగతజీవిగా.. అసలేం జరిగిందంటే..!

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న ఆరు రోజులకే యువతి ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటన ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో వెలుగు చూసింది. అత్తింట్లో ఏదైనా జరగడం వల్ల తన కూతురు బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని మృతురాలి తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కోరుకున్నవాడిని కట్టుకుంది.. పెళ్లైన ఆరు రోజులకే విగతజీవిగా.. అసలేం జరిగిందంటే..!
Newly Married
G Sampath Kumar
| Edited By: |

Updated on: Oct 04, 2025 | 1:18 PM

Share

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న ఆరు రోజులకే యువతి ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటన ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామ శివారులోని ఒడ్డెర కాలనీకి చెందిన అల్లెపు గంగోత్రి(22), అదే కాలనీకి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. రెండు కుటుంబాలను ఒప్పించి, పెద్దల సమక్షంలో సెప్టెంబరు 26న పెళ్లి చేసుకున్నారు.

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన గంగోత్రి భర్తతో కలిసి పుట్టినింటికి వచ్చింది. ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్న సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం భార్యాభర్తలు ఇద్దరు కలిసి తమ ఇంటికి వెళ్లిపోయారు. అయితే గురువారం (అక్టోబర్ 2) అర్ధరాత్రి దాటిన తర్వాత గంగోత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. భర్తతో జరిగిన గొడవతో మనస్తాపానికి గురై ఉంటుందదని స్థానికులు భావిస్తున్నారు. కాగా అత్తింట్లో ఏదైనా జరగడం వల్ల తన కూతురు బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని మృతురాలి తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టారు

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..