IPS Officers: అత్యధిక ఐపీఎస్‌లు వచ్చేది ఈ రాష్ట్రం నుండే.. ఎందుకంత స్పెషలంటే..?

ఒక్కొక్కరిదీ ఒక్కో కుటుంబ నేపథ్యం..! ఒకరిది సామాన్య రైతు కుటుంబం, మరొకరిది ఉన్నత చదువులు హోదా కలిగిన కుటుంబం. ఇంకొకరిదw పోలీస్ కుటుంబం.. ఇలా నేపథ్యాలు ఎలా ఉన్నా వాళ్ళందరిని ఒకటి చేసిందీ ఓ కల.

IPS Officers: అత్యధిక ఐపీఎస్‌లు వచ్చేది ఈ రాష్ట్రం నుండే.. ఎందుకంత స్పెషలంటే..?
Ips Officers
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Balaraju Goud

Updated on: Sep 18, 2024 | 5:10 PM

ఒక్కొక్కరిదీ ఒక్కో కుటుంబ నేపథ్యం..! ఒకరిది సామాన్య రైతు కుటుంబం, మరొకరిది ఉన్నత చదువులు హోదా కలిగిన కుటుంబం. ఇంకొకరిదw పోలీస్ కుటుంబం.. ఇలా నేపథ్యాలు ఎలా ఉన్నా వాళ్ళందరిని ఒకటి చేసిందీ ఓ కల. అదే ఐపీఎస్ అవ్వాలనే పట్టుదల. ఆశయాన్ని కలగానే మిగల్చకుండా కాలంతో పోటీ పడి, తమ కలను సాకారం చేసుకున్నారు 76 వ బ్యాచ్ ఐపీఎస్‌లు. సెప్టెంబర్ 20వ తేదీన నేషనల్ పోలీస్ అకాడమీ లో దిక్షాంత్ పరెడ్ నిర్వహించనున్నారు.

అటు ఇండోర్, ఇటు ఔట్ డోర్‌లో వారాల తరబడి శిక్షణ పొందారు. రెండు సంవత్సరాల పాటు అన్ని విభాగాల్లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. 76వ బ్యాచ్ లో 188 మంది ఇండియన్ పోలీస్ సర్వీస్ ట్రెనీ అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 58 మంది మహిళా ఐపీఎస్ ఉండటం విశేషం. ఎప్పటి లాగానే ఈసారి కూడా బీటెక్ చదివిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటి వరకు నేషనల్ పోలీస్ అకాడమీ నుండి 6,379 మంది ట్రైనీ ఆఫీసర్లు అకాడమీలో శిక్షణ పొందారు. ఏడాది అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుండి ట్రైనీ ఐపీఎస్ లో సెలెక్ట్ అయ్యారు. యూపీ నుండి 18 శాతం మంది ఐపీఎస్ కు సెలెక్ట్ కాగా, అత్యల్పంగా బీహార్ రాష్ట్రం నుండి ఆరు శాతం మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఈసారి సైబర్ క్రైమ్ తో పాటు డ్రోన్ టెక్నాలజీ, డ్రగ్స్ నిరోధం, కొత్త క్రిమినల్ చట్టాలు పై శిక్షణ ఇచ్చినట్లు నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ తెలిపారు.

104 వారంలో మొదటి 15 వారాలు ముసోరీలో ట్రైనీ ఐపీఎస్ లకు శిక్షణ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత పోలీస్ అకాడమీలో ఫేజ్-1 శిక్షణ 49 వారాల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత 29 వారాలు రియల్ టైం ఎక్స్‌పీరియన్స్‌ను చేస్తారు. మరో 9 వారాలు ఫేస్ టూ ట్రైనింగ్ ఉంటుంది. గతంతో పోలిస్తే 76వ ఐపీఎస్ బ్యాచ్‌లో మహిళ ఐపీఎస్ ల సంఖ్య పెరిగింది. 188 మంది ఆఫీసర్స్ లో 27% మహిల ఐపీఎస్ ఉన్నారు. 54 మంది మహిళ ఐపీఎస్ లో 76వ బ్యాచ్ లో ఉన్నారు. వీరిలో 38 మంది మహిళ ఐపీఎస్ లకు ఇంకా పెళ్లి కాలేదు. 188 ట్రైనింగ్ ఐపీఎస్లలో 154 మంది అవివాహితులుగా ఉన్నారు. వీరిలో ఎక్కువమంది 25 నుండి 28 వయసులో ఉన్నవారే అధికంగా ఉన్నారు. 102 మంది ట్రైన్ ఐపీఎస్ లో 25 నుండి 28 వయసులోపే ఉన్నవారే..!

188 మందిలో ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణకు మొత్తం 8 మందిని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముగ్గురు మహిళ ఐపీఎస్ లతోపాటు మరొకరితో కలిపి నలుగురుని కేటాయించారు. మనీషా రెడ్డి, దీక్ష, హేమంత్, సుస్మిత లు ఏపీకి కేటాయించారు. మరోవైపు తెలంగాణకు నలుగురు ట్రైనీ ఐపీఎస్లను కేటాయించారు. సాయికిరణ్, రుత్విక్ సాయి, వసుంధర యాదవ్, మన్ బట్ లను తెలంగాణకు కేటాయించారు.

వీరిలో ఏపీకి కేటాయించిన మనీషా రెడ్డి వ్యవసాయ కుటుంబానికి చెందిన యువతి. కర్నూలు జిల్లా నంద్యాల లోని మహానందికి చెందిన మనీషా అనేక కష్టాలను అధిగమించి ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యారు. తండ్రి వ్యవసాయం చేస్తుండగా, ఇద్దరు తమ్ముళ్లు.. వ్యవసాయ కుటుంబం కావటంతో ఎన్ని కష్టాలు ఎదురైనా ఐపీఎస్ కావాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఒక తెలంగాణ క్యాడర్‌కు కేటాయించిన నలుగురు ఐపీఎస్‌లలో ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ లు వరంగల్ జిల్లాకు చెందినవారే కావడం విశేషం. రిత్విక్ సాయి తోపాటు, సాయికిరణ్ ఇద్దరు వరంగల్ ప్రాంతానికి చెందిన వారే. చిన్నప్పటి నుండి చూసిన సమస్యలు, పెరిగిన నేపథ్యం అన్ని చూసి అదే ప్రాంతానికి తమను కేటాయించడం నిజంగా ఎంతో సంతోషంగా ఉందంటున్నారు ఇద్దరు యువ ఐపీఎస్‌లు. హర్యానా కు చెందిన మరో ఐపీఎస్ దీక్షను ఏపీ కు కేటాయించారు. కుటుంబ మొత్తం చదువుకున్న నేపథ్యం ఉన్న ట్రైనీ ఐపీఎస్. భర్త IRS అధికారి, తండ్రి DEO.. తనలా చాలా మంది మహిళలు సివిల్ సర్వీసెస్ ను ఎంచుకోవడం ఆనందంగా ఉందంటున్నారు.

సెప్టెంబర్ 20 న నేషనల్ పోలీస్ అకాడమీ నుండి 188 మంది ఐపీఎస్ లు పాస్ అవుతున్నారు. వీరిలో చాలా మంది 5వ సారి అటెంప్ట్ లో ఐపీఎస్ కొట్టారు. కాగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి నిత్య మీనన్ రాయ్ హాజరవుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!