Andhra Pradesh: స్టవ్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు.. సెల్‌ఫోన్ ఉంటే చాలు.. వంట చేసేయొచ్చు..!

ఫోన్ యాప్ ద్వారా పని చేసేలా స్మార్ట్ కుక్కర్‌ను తయారు చేశాడు కాకినాడ జిల్లా యువకుడు. పిఠాపురం మండలం నర్సింగపురం గ్రామానికి చెందిన దెయ్యాల పవన్ మనేశ్వర్ అనే యువకుడు.. ఐటిఐ చదివి ప్రస్తుతం దుబాయిలో ఏసీ మెకానిక్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.

Andhra Pradesh: స్టవ్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు.. సెల్‌ఫోన్ ఉంటే చాలు.. వంట చేసేయొచ్చు..!
Smart Cooker
Follow us
Pvv Satyanarayana

| Edited By: Balaraju Goud

Updated on: Sep 18, 2024 | 4:46 PM

ఫోన్ యాప్ ద్వారా పని చేసేలా స్మార్ట్ కుక్కర్‌ను తయారు చేశాడు కాకినాడ జిల్లా యువకుడు. పిఠాపురం మండలం నర్సింగపురం గ్రామానికి చెందిన దెయ్యాల పవన్ మనేశ్వర్ అనే యువకుడు.. ఐటిఐ చదివి ప్రస్తుతం దుబాయిలో ఏసీ మెకానిక్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. గతంలో హెల్మెట్ లేకపోతే బైక్ స్టార్ట్ అవ్వని విధంగా, స్మార్ట్ హెల్మెట్ ని కనిపెట్టాడు. దీనిని గత ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న పినిపే విశ్వరూప్ ముందు స్మార్ట్ హెల్మెట్ ను ప్రదర్శించాడు. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో కనిపెట్టిన స్మార్ట్ హెల్మెట్‌ను పక్కన పెట్టి, బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి ఏసీ మెకానిక్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు.

ఇక ఏపీలో ఏన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెగ్గడంతో పవన్ మనేశ్వర్‌లో కొత్త ఆశలు చిగురించాయి. దుబాయ్ లో పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్లో కొత్త ఆవిష్కరణ చేయాలని సంకల్పంతో ఫోన్ యాప్ ద్వారా పనిచేసే స్మార్ట్ కుక్కర్‌ను కనిపెట్టాడు. ఐదు నిమిషాల్లో ఏ వంటనైన తయారు చేసేలా స్మార్ట్ కుక్కర్ పనితీరు ఉంటుందని చెబుతున్నాడు.

బ్యాచలర్స్‌కు, ఉద్యోగస్థులకు ఈ కుక్కర్ బాగా ఉపయోగపడుతుందని దయ్యాల పవన్ మనేశ్వర్ అంటున్నాడు. ఎక్కడినుండి అయినా స్మార్ట్ ఫోన్‌లోని యాప్ ద్వారా కుక్కర్‌ను ఆన్ చేసుకోవచ్చని డెమో చూపిస్తున్నాడు. ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తే తాను ఒక ఫ్యాక్టరీ పెట్టి ఆనేక మందికి ఉపాధి కల్పిస్తానంటున్నాడు. టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సహాయ సహకరాల కోసం ఎదురుచూస్తున్నాని పవన్ మనేశ్వర్ చెబతున్నాడు. ప్రభుత్వం ముందుకు తను కనిపెట్టిన స్మార్ట్ హెల్మెట్, స్మార్ట్ కుక్కర్ లను గుర్తిస్తే రైతులకు ఉపయోగపడే విధంగా మరో కొత్త ఆవిష్కరణ చేస్తానంటున్నాడు పవన్ మనేశ్వర్. ప్రభుత్వ సహాకారంతో మరిన్ని ఫలితాలు సాధిస్తానంటున్నాడు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా
4గంటల దూరానికి 40 ఏళ్లు పట్టిందిః మోదీ
4గంటల దూరానికి 40 ఏళ్లు పట్టిందిః మోదీ