Jani Master: జానీమాస్టర్‌పై పోక్సో కేసు.. రంగంలోకి దిగిన పోలీసు బృందాలు.. ప్రస్తుతం ఎక్కడున్నాడంటే..

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదైంది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అలాగే అత్యాచారం కూడా చేశాడంటూ ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మూడు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి, కేసును నార్సింగి పీఎస్ కు బదిలీ చేశారు. ప్రస్తుతం..

Jani Master: జానీమాస్టర్‌పై పోక్సో కేసు.. రంగంలోకి దిగిన పోలీసు బృందాలు.. ప్రస్తుతం ఎక్కడున్నాడంటే..
Jani Master
Follow us
Subhash Goud

|

Updated on: Sep 18, 2024 | 5:22 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదైంది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అలాగే అత్యాచారం కూడా చేశాడంటూ ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మూడు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి, కేసును నార్సింగి పీఎస్ కు బదిలీ చేశారు. ప్రస్తుతం జానీమాస్టర్‌ పరారీలో ఉన్నాడు. నార్సింగ్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే జానీ మాస్టర్‌ ప్రస్తుతం లడఖ్‌లో ఉన్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రత్యేక బృందాలతో లడఖ్‌ బయలుదేరారు.

మరోవైపు ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. అలాగే ఆమె నుంచి ఇప్పటికే సఖి, భరోసా బృందాలు తగిన వివరాలు సేకరించాయి. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నార్సింగి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌ లడఖ్‌లో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు బృందాలు అక్కడికి బయలుదేరాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.