Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3D Printed Temple: ప్రపంచంలో తొలి త్రీడీ ప్రింటెడ్ దేవాలయం.. ఎక్కడో కాదు.. మన తెలంగాణలోనే అద్భుత ఆలయం

ఈ రోబోటిక్ తో భవన నిర్మాణాలు చేయడం ద్వారా ఎన్నో లాభలు ఉన్నాయి అంటున్నారు..వివిధ రకాల డిజైన్ల ద్వారా 3డీ ప్రిటింగ్ చేయవచ్చు...ఏదైనా విపత్తు వచ్చినప్పుడు అక్కడ త్వరగా ఇండ్లు కట్టాలన్నప్పుడు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది..ఈ రోబోటిక్ మిషన్ ను మంచు కొండలు, ఎతైన ప్రాంతాల్లోకి తీసుకు వెళ్లి అక్కడ నిర్మాణలు చేపట్టడానికి బాగుంటుంది అంటున్నారు.. దీని

3D Printed Temple: ప్రపంచంలో తొలి త్రీడీ ప్రింటెడ్ దేవాలయం.. ఎక్కడో కాదు.. మన తెలంగాణలోనే అద్భుత ఆలయం
3d Printed Temple
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 06, 2023 | 12:06 PM

ఇప్పుడు అన్ని రంగాల్లోకి రోబోటిక్ ఎంట్రీ అయ్యింది. అయితే ప్రస్తుతం భవన నిర్మాణ రంగంలోకి కూడా రోబోటిక్ మిషన్ రావడంతో నిర్మాణ పనులు చక చక జరుగుతున్నాయి. గుడి,బడి..ఇల్లు ఇలా ఏ నిర్మాణం చేపట్టాలన్నా ఎంతో వ్యయ ప్రయాసాలు తప్పవు. సామాగ్రి, కూలీలు అన్నీ అందుబాటులో ఉన్నా.. నిర్మాణం పూర్తవ్వాలంటే నెలలు గడవాల్సిందే. అయితే ఈ కష్టాలకు చెక్ పెడుతూ .. కేవలం గంటల వ్యవధిలోనే నిర్మాణాలు పూర్తి చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. .భారతదేశంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ (రోబో)తో ఆధ్యాత్మిక టెంపుల్స్ ను నిర్మిస్తున్నారు సిద్దిపేటలో.. తాజాగా సిద్దిపేట అర్బన్‌ మండలం బూరుగుపల్లి సమీపంలోని ఓ ప్రయివేటు విల్లాస్ వాళ్లు త్రీడీ ప్రిటింగ్ టెక్నాలజీ(రోబో)తో మూడు ఆలయాలను నిర్మిస్తున్నారు..అప్సూజ కంపెనీ నిర్మాణ బాధ్యతలను తీసుకుని సింప్లీ పోర్జ్‌ అనే త్రీడీ టెక్నాలజీ కంపెనీకి అప్పగించింది..ఈ త్రీడీ టెం పుల్‌ నిర్మాణంలో భాగంగా 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తుతో మొదటగా వినాయక ఆలయం, ఆ తర్వాత శివాలయం, ఆ తర్వాత అమ్మవారి ఆలయాలు మూడింటిని పక్క పక్కనే నిర్మిస్తున్నారు..మాన్యువల్‌గా మనుషులు తయారు చేయలేని డిజైన్‌ను కంప్యూటర్‌లో పొందుపరిచి ఆ డిజైన్‌ను కాంక్రీట్‌ త్రీడీ మిషన్‌ ద్వారా నిర్మిస్తున్నారు…

ఈ త్రీడీ టెంపుల్స్‌ నిర్మాణం చేయడంలో ముఖ్యఉద్దేశం అత్యంత టెక్నాలజీతో కూడిన కంప్యూటర్‌ డిజైనింగ్‌ తో పాటు నిర్మాణం సమయం కూడా కలిసి రావడం, తక్కువ మ్యాన్‌పవర్‌తో అందమైన డిజైన్‌ రావడం వంటి అంశాల కారణంగా త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో రూపొందించాలని ఆలోచన కలిగినట్లు ఇంజనీర్లు చెబుతున్నారు..మరో నెల రోజుల సమయంలోఈ టెంపుల్‌ నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు ఇంజనీర్లు చెప్పారు..

ప్రస్తుతం వీరు వినియోగిస్తున్న త్రీడీ ప్రిటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్ ను ఏబీబీ అనే యూరోపియన్ నుండి తీసుకొచ్చారు..అయితే దీనిలో ఉండే ఇంటర్నల్ సిస్టమ్, దీని కోసం వినియోగించే సాఫ్ట్ వేర్ మొత్తన్ని ఇండియాలోనే తయారు చేసారు..ఈ రోబోటిక్ తో భవన నిర్మాణాలు చేయడం ద్వారా ఎన్నో లాభలు ఉన్నాయి అంటున్నారు..వివిధ రకాల డిజైన్ల ద్వారా 3డీ ప్రిటింగ్ చేయవచ్చు…ఏదైనా విపత్తు వచ్చినప్పుడు అక్కడ త్వరగా ఇండ్లు కట్టాలన్నప్పుడు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది..ఈ రోబోటిక్ మిషన్ ను మంచు కొండలు, ఎతైన ప్రాంతాల్లోకి తీసుకు వెళ్లి అక్కడ నిర్మాణలు చేపట్టడానికి బాగుంటుంది అంటున్నారు.. దీని ద్వారా ఇండ్ల నిర్మాణం కూడా చేయవచ్చు అని,నెలలో వ్యవధిలో కట్టే ఇండ్లను కేవలం గంటల వ్యవధిలో పూర్తి చేయవచ్చు అని అంటున్నారు. నిర్మాణంలో దీని వాడడం వల్ల మెటీరియల్ కూడా చాలా తక్కువ పడుతుంది అని అంటున్నారు..

ఇవి కూడా చదవండి

ఈ త్రీడీ ప్రింటింగ్(రోబోటిక్) ద్వారా చాలా రకాల డిజైన్ ల ను నిర్మించవచ్చు…ఒక డిజైన్ ఎంచుకొని దాన్ని ఈ మిషన్ లో ఫిక్స్ చేస్తే చాలు అదే నిర్మాణం చేసుకుంటూ పోతుంది.. కేవలం ముగ్గురు మనుషులు ఉంటే చాలు..పోయిన సంవత్సరమే దీన్ని సిద్దిపేటకు తీసుకోచ్చిన, గత సంవత్సరం మొత్తం దీనికి కావల్సిన మెటీరియల్ ను ఏర్పాటు చేసుకుని,ఈ సంవత్సరం నిర్మాణాలను మొదలు పెట్టారు..ఇప్పటికే పార్క్ లో పలు రకాల బెంచ్ లను, చెట్ల పరిరక్షణ గోడలను నిర్మించారు. అలాగే మూడు నెలల క్రితం ఐఐటి హైదరాబాద్ తో వాళ్లతో కలిసి ఒక త్రీడీ ప్రింటర్ బ్రిడ్జిని నిర్మించారు.