Tea shop: నీ తెలివికి దండం సామీ.. కోట్ల విలువైన ఆడి కారులో ఇదేం దుకాణం గురూ..!
ఈ వీడియోలలో ఒకదానిలో, ఒక వ్యక్తి విలాసవంతమైన ఇంటిని విడిచిపెట్టి.. అంతే విలాసవంతమైన ఆడి కారులో వెళుతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆడి కారులో బయల్దేరిన ఆ వ్యక్తి ఏదో కార్పొరేట్ ఆఫీసుకి గానీ, తన కార్యాలయానికి వెళ్తున్నాడని అందరూ అనుకుంటారు. కానీ..

సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో కొందరు సాధించిన విజయాలు, వారి జీవన ప్రయాణం ఎలా సాగిందో వివరిస్తూ చెప్పే వీడియోలు కూడా అనేకం ఉంటాయి. అలాంటి వాటిల్లో కొందరు టీ స్టాల్‌తో వ్యాపారం ప్రారంభించిన కోటీశ్వరులుగా ఎదిగిన కథనాలు కూడా అనేకం ఇప్పటికే సోషల్ మీడియాలో మనం చూశాం. అలాంటి వారిలో ఎంబీఏ చాయ్‌వాలా, బీటెక్ చాయ్‌వాలీ తర్వాత ఇప్పుడు ఆడి చాయ్‌వాలాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో విలాసవంతమైన ఇంట్లో ఉంటున్న ఓ వ్యక్తి వేలకోట్ల రూపాయల విలువైన కారులో వచ్చి టీ అమ్ముతున్నాడు. తన చేతులతో టీ తయారు చేసి కస్టమర్లకు అందిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు వేల, మిలియన్ల వ్యూస్‌ని సేకరించింది.
ఈ వీడియోలలో ఒకదానిలో, ఒక వ్యక్తి విలాసవంతమైన ఇంటిని విడిచిపెట్టి.. అంతే విలాసవంతమైన ఆడి కారులో వెళుతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆడి కారులో బయల్దేరిన ఆ వ్యక్తి ఏదో కార్పొరేట్ ఆఫీసుకి గానీ, తన కార్యాలయానికి వెళ్తున్నాడని అందరూ అనుకుంటారు. కానీ దానికి విరుద్ధంగా, అతను ముంబైలోని లోఖండ్‌వాలా బ్యాక్‌రోడ్‌లో ఆడి నుండి దిగిపోతాడు. ఇక్కడ హఖీ స్వయంగా టీ తయారు చేసి విక్రయిస్తున్న టీ స్టాల్ ఉంది.




View this post on Instagram
నివేదికల ప్రకారం, అమిత్ కశ్యప్. మన్ను శర్మ అనే ఇద్దరు వ్యక్తులు ఆడి చాయ్‌వాలాను ప్రారంభించారు. వ్యాపారంలో భాగంగా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే ఈ టెక్నిక్‌ను ఉపయోగించినట్టుగా వారు వెల్లడించారు. ఆడి చాయ్‌వాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు కూడా ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. ఇది చూసి ఆడి కంపెనీ యజమాని ఏమనుకుంటున్నారో అంటూ ఒక వినియోగదారు రాశారు. మొత్తానికి ఈ వీడియోపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..