AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biryani Rates: రూ. 32 కే మటన్ బిర్యానీ..రూ. 30 కే చికెన్ బిర్యానీ..! ఇంకా ఈ మెనూ చూడండి..

పెరిగిపోతున్నాయి. సాధారణ భోజనం ఖరీదు సుమారు 100 రూపాయల నుంచి మొదలవుతుంది. ఇక, హోటల్‌కి వెళ్లి సాధా భోజనం ఎవరు చేస్తారు.. ఏ బిర్యానీయో ఆర్డర్‌ చేస్తారు.. అలా భార్యాభర్తలిద్దరూ, తమ పిల్లలతో కలిసి రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు బిర్యానీ తినాలంటే పర్స్‌ ఖాళీ అవ్వాల్సిందే. కానీ, తాజాగా ..

Biryani Rates: రూ. 32 కే మటన్ బిర్యానీ..రూ. 30 కే చికెన్ బిర్యానీ..! ఇంకా ఈ మెనూ చూడండి..
Biryani
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2023 | 7:30 AM

Share

Chicken Rates in Year 2001: నోరూరించే రుచికరమైన వంటకాలను ఆస్వాదించాలంటే జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే. ఎందుకంటే, ఏదైనా హోటల్‌కి గానీ, రెస్టారెంట్‌కు గానీ వెళితే.. వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిందే. ప్రస్తుతం ఆహార పదార్థాల ధరలు ఊహించనంతగా పెరిగిపోతున్నాయి. సాధారణ భోజనం ఖరీదు సుమారు 100 రూపాయల నుంచి మొదలవుతుంది. ఇక, హోటల్‌కి వెళ్లి సాధా భోజనం ఎవరు చేస్తారు.. ఏ బిర్యానీయో ఆర్డర్‌ చేస్తారు.. అలా భార్యాభర్తలిద్దరూ, తమ పిల్లలతో కలిసి రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు బిర్యానీ తినాలంటే పర్స్‌ ఖాళీ అవ్వాల్సిందే. కానీ, తాజాగా సోషల్ మీడియాలో ఒక పాత మెనూ కార్డు వైరల్ అవుతోంది. అందులో రాసున్న ఆహార పదార్థాల ధరలు చూస్తే మీరు షాక్ అవుతారు. ఎస్పెషల్లీ నాన్ వెజ్ మెనూ ఐటమ్స్ ధరలు చూస్తే మరీ షాక్ అవుతారు. ప్రముఖ ఉర్దూ కవి, సాహితీవేత్త, గేయ రచయిత గుల్జార్ ఈ పాత మెనూ కార్డును తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌లో 2001 సంవత్సర కాలం నాటి ఒక హోటల్‌లో మెనూ కార్డులో ఆహార పదార్థాల ధర పట్టిక చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. 2001 సంవత్సరం నాటి ఈ మెనూ కార్డులో ఎగ్ రోల్ రూ.7, చికెన్ రోల్ రూ.10, ఎగ్ చికెన్ రోల్ రూ.15, ఎగ్ మటన్ రోల్ రూ.16లకు లభించనున్నట్టుగా ఈ మెనూ లిస్ట్‌లో రాసుంది. ప్రస్తుతం ఒక్కో ప్లేట్‌కు దాదాపు రూ.150 ఉన్న చికెన్ బిర్యానీ అప్పట్లో రూ.30కి విక్రయించేవారు. అదే విధంగా, ఇప్పుడు ప్లేట్‌కు సుమారు రూ. 250 చొప్పున విక్రయిస్తున్న మటన్ బిర్యానీ 2001లో రూ.32 ఉండేది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌తో ప్రజలు వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకునేలా చేసింది. మెనూ ఆధారంగా 2001లో చికెన్ చాప్ రూ.25, చికెన్ దోప్యాజా రూ.30, చికెన్ ముసల్లం రూ.85, చికెన్ టిక్కా రూ.45 లకు మాత్రమే అని ఈ మెనూ కార్డులో రాసుంది. ఇక మటన్ మొఘలాయి రూ.30, మటన్ హండీ రూ.50, మటన్ చాప్ రూ.25, మటన్ దోప్యాజా కేవలం రూ.32కే లభించేవి. ఫిష్ ఫుడ్ లవర్స్ కి కూడా అప్పట్లో తక్కువ ధరలోనే నచ్చిన ఆహార పదార్థాలు లభించేవి అని ఈ మెనూ కార్డు చూస్తే అర్థం అవుతోంది.

అప్పటి మెనూ కార్డు ఆధారంగా..2001లో రూ.10 లకే ఫిష్ ఫ్రై, ఫిష్ కట్లెట్ రూ.10, రూ.16 లకే ఫిష్ ఫింగర్, రూ.25 ఫిష్ తందూరి లభించును అని మెనూకార్డులో రాసి ఉంది. ఇక రోటీల విషయానికి వస్తే.., రుమాలి రోటీ ధర కేవలం రూ.1.25, లచ్చ పరాటా ధర రూ.5 కి లభించేవి. అప్పడు ఉన్న ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు కనీసం నాలుగైదు రెట్లు పెరిగాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..