JEE మెయిన్స్ పరీక్షలోనూ మాస్ కాపీయింగ్.. ఆలస్యంగా వెలుగులోకి.. నలుగురు అరెస్ట్..
సికింద్రాబాద్‌లో ఉన్న విద్యార్థి మొబైల్ నుండి మిగతా వారికి సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపించినట్టుగా తెలిసింది. మొబైల్ వాడుతున్నాడని గుర్తించిన ఇన్విజిలేటర్ వారిని పట్టుకుని వెంటనే అధికారులకు సమాచారం అందించారు ఇన్విజిలేటర్. దీంతో మిగతా పరీక్షా కేంద్రాల్లోని ముగ్గురు విద్యార్థులను పట్టుకున్నారు అధికారులు.
కాదేదీ కాపీకి అర్హం అన్నట్టుగా మారింది ప్రస్తుతం పరీక్షల పరిస్థితి. తెలంగాణలో ఇప్పటికే పేపర్ లీకేజీ ఘటన తీవ్ర సంచలనం రేపుతుండగా, తాజాగా JEE మెయిన్స్ పరీక్షలోనూ మాస్ కాపీయింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. నలుగురు విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్స్ తీసుకెళ్లినట్టుగా తెలిసింది. వారు ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు సమాధానాల కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలిసింది. సికింద్రాబాద్, మల్లాపూర్, మౌలాలి, ఎల్బీనగర్ పరీక్ష కేంద్రాల్లో ఇలాంటి మాస్ కాపీయింగ్ జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్‌లో ఉన్న విద్యార్థి మొబైల్ నుండి మిగతా వారికి సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపించినట్టుగా తెలిసింది. మొబైల్ వాడుతున్నాడని గుర్తించిన ఇన్విజిలేటర్ వారిని పట్టుకుని వెంటనే అధికారులకు సమాచారం అందించారు ఇన్విజిలేటర్. దీంతో మిగతా పరీక్షా కేంద్రాల్లోని ముగ్గురు విద్యార్థులను పట్టుకున్నారు అధికారులు.
జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ సంచలనం రేపుతోంది. ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా కాపీ చేసిన నలుగురు విద్యార్థులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం జరిగిన స్మార్ట్ కాపీయింగ్ పై హైదరబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జిల్లాకు చెందిన ssc, ఇంటర్ లో టాపరే ఈ కేసులో కీలక సూత్రధారిగా తెలిసింది. కడప విద్యార్థి తన మిత్రుల కోసం స్మార్ట్ కాపీయింగ్ చేసినట్టుగా తెలిసింది. సికింద్రాబాద్లోని ఎస్ వి ఐ ఈ సెంటర్లో కాపీయింగ్ జరిగింది. తాను రాసిన జవాబు పేపర్ వాట్సప్ ద్వారా మిత్రులకు షేర్ చేశాడు విద్యార్థి. వివిధ సెంటర్లో ఉన్న నలుగురు విద్యార్థులకు వాట్సాప్ ద్వారా జవాబు పత్రం చేరవేశాడు. Dilsuknagar లో కడప విద్యార్థిని ఫ్రెండ్స్ నీ పట్టుకున్నారు అబ్జర్వర్. ఎస్ వి ఐ ఈ సెంటర్ నుంచి జవాబు పేపర్ వచ్చినట్లు గుర్తించారు. కడప జిల్లా టాపర్ నీ అదుపులో తీసుకొని పోలీసులకు అప్పగించారు అబ్జర్వర్.
జేఈఈ 2023 మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు; రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్సర్ కీని కూడా తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.
JEE మెయిన్ B.Tech, B.Arch, B.NIT, IIIT మరియు GFTIలలో ప్రవేశాల కోసం bt NTA నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. JEE అడ్వాన్స్‌డ్ కోసం JEE మెయిన్ స్క్రీనింగ్ పరీక్షగా కూడా నిర్వహించబడుతుంది . టాప్ 2,50,000 అర్హత పొందిన JEE మెయిన్ అభ్యర్థులు IITలో B.Tech అడ్మిషన్ కోసం JEE అడ్వాన్స్‌డ్‌కు హాజరుకావచ్చు. IITలో ప్రవేశం కోసం లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు JEE అడ్వాన్స్‌డ్ 2023కి కూర్చోవడానికి తప్పనిసరిగా 90+ పర్సంటైల్ స్కోర్ చేయాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..