DRDO Recruitment: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో 150 ఖాళీలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలోని రిసెర్చ్‌ సెంటర్‌ ఐమరత్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

DRDO Recruitment: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో 150 ఖాళీలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
Drdo Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 06, 2023 | 1:52 PM

డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలోని రిసెర్చ్‌ సెంటర్‌ ఐమరత్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు (30), టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా) ఖాళీలు (30), ట్రేడ్ అప్రెంటిస్ (ఐటీఐ) ఖాళీలు (90) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత స్పెసలైజేషన్‌లో ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను అకడమిక్ మెరిట్/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ఆధారంగా స్టైపండ్‌ అందిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు జూన్‌ 19వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..