AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాలికి తిరుగుతున్నాడు, ఎందుకు పనికిరాడు అనుకున్నాం.. కట్ చేస్తే పెద్ద హీరో అయ్యాడు

విలన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సీనియర్ నటుడు చలపతి రావు. విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలో పోషిచారు చలపతి రావు. ఎంతో మంది స్టార్ హీరోలతో నటించారు ఈ స్టార్ నటుడు

గాలికి తిరుగుతున్నాడు, ఎందుకు పనికిరాడు అనుకున్నాం.. కట్ చేస్తే పెద్ద హీరో అయ్యాడు
Chalapathi Rao
Rajeev Rayala
|

Updated on: Mar 07, 2026 | 4:56 PM

Share

విలక్షణ నటనతో ఎంతో మంది నటులు టాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో సీనియర్ నటుడు చలపతి రావు ఒకరు. విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టారు చలపతి రావు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి అలరించారు చలపతి రావు. విలన్‌గా రాణించిన ఆయన ఆతర్వాత సహాయక పాత్రలు చేశారు. ముఖ్యంగా తండ్రి పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. చలపతిరావు ఏకంగా 1200లకు పైగా సినిమాల్లో పలు రకాలైన పాత్రల్లో నటించి మెప్పించారు. 1966లో విడుదలైన సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116 సినిమాతో ఆయన చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు. ఎన్నో సినిమాల్లో మెప్పించారు.

తెలుగులో దాదాపు అందరు హీరోల సినిమాల్లో నటించారు చలపతిరావు. అంతే కాదు ఎంతో మంది హీరోలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. కాగా గతంలో చలపతిరావు ఓ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఓ హీరో ఎందుకూ పనికిరాకుండా పోతాడని అతని తండ్రి బాధపడ్డాడు అని అన్నారు చలపతి రావు. ఇంతకూ ఆ హీరో ఎవరంటే.. చలపతి రావు గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అల్లరి సినిమా గురించి చెప్పారు. రవిబాబు వచ్చి అల్లరి సినిమా కథ గురించి చెప్పాడు. అప్పుడు ఏ హీరోతో చేస్తున్నావ్ అని అడిగితే ఈవీవీ సత్యనారాయణ గారి రెండో అబ్బాయి నరేష్ అని అన్నాడు.. నేను ఆశ్చర్యపోయా..!!

ఎందుకంటే ఈవీవీగారు నాతో ఎప్పుడు నరేష్ గురించి చెప్తూ ఉంటారు. వీడిని ఎదో ఒకటి చేయాలి గాలికి తిరుతున్నాడు, ఎందుకూ పనికి రాకుండా పోతాడేమో అనిపిస్తుంది. యాక్టర్‌గా పనికిరాడేమో అని బాధపడేవారు. అలాంటిది రవిబాబు నరేష్ హీరో అనగానే నేను షాక్.. కథకు అతను సెట్ అవుతాడు అని రవిబాబు నన్ను ఒప్పించాడు. సరే అని నేను ఈవీవీ గారిని అడిగాను. ఆయన ముందు నేను జోక్ చేస్తున్నా అనుకున్నాడు.. ఫైనల్‌గా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది అని తెలిపారు. ఇక నరేష్ విషయానికొస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నరేష్. కామెడీ సినిమాలతో పాటు సీరియస్ యాక్షన్ సినిమాలు కూడా చేసి మెప్పిస్తున్నాడు నరేష్.

Allari Naresh

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us