SBI Recruitment 2023: ఎస్బీఐ నుంచి మరో నోటిఫికేషన్.. నెలకు రూ. 75లక్షల వరకూ జీతం.. వివరాలు ఇవి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 28 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మూడేళ్ల కాంట్రాక్ట్ తో వీటిని భర్తీ చేస్తామని, మరో రెండేళ్లు తర్వాత కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉందని పేర్కొంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 28 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మూడేళ్ల కాంట్రాక్ట్ తో వీటిని భర్తీ చేస్తామని, మరో రెండేళ్లు తర్వాత కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉందని ఎస్బీఐ పేర్కొంది. ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 75లక్షల వరకూ జీతం ఇస్తామని ఎస్బీఐ తన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2023లో పేర్కొంది. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. ఈ మెయిల్ ద్వారా ఇంటర్వ్యూ సమాచారం అందిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఖాళీల వివరాలు:
- వైస్ ప్రెసిడెంట్ (ట్రాన్స్ఫార్మేషన్)- 1 పోస్టు
- సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- ప్రోగ్రామ్ మేనేజర్- 4 పోస్టులు
- సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- క్వాలిటీ అండ్ ట్రైనింగ్ (ఇన్‌బౌండ్ అండ్ ఔట్‌బౌండ్)- 1 పోస్టు
- సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- కమాండ్ సెంటర్ – 3 పోస్టులు
- సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ (మార్కెటింగ్)- 1 పోస్టు
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)/ చీఫ్ మేనేజర్ (మార్కెటింగ్)- 18 పోస్టులు
వయస్సు పరిమితి..
- వైస్ ప్రెసిడెంట్ (ట్రాన్స్ఫార్మేషన్)- 50 ఏళ్లకు మించకూడదు.
- సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- ప్రోగ్రామ్ మేనేజర్- 35 ఏళ్ల లోపు ఉండాలి.
- సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- క్వాలిటీ అండ్ ట్రైనింగ్ (ఇన్‌బౌండ్ అండ్ ఔట్‌బౌండ్)- 40 ఏళ్లు
- సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- కమాండ్ సెంటర్ – గరిష్టంగా 40 ఏళ్లు
- సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ (మార్కెటింగ్)- 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు ఉండాలి.
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)/ చీఫ్ మేనేజర్ (మార్కెటింగ్)- 35 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు ఉండాలి.
సెలక్షన్ ప్రక్రియ:
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్/ చీఫ్ జనరల్ మేనేజర్- షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ.
- కాంట్రాక్ట్ పోస్టులు- షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, సీటీసీ నెగోషియేషన్.
- ఇతర పోస్టులు- షార్ట్ లిసటింగ్, ఇంటర్వ్యూ, సీటీసీ నెగోషియేషన్.
అప్లికేషన్ ఫీజు..
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థుల ఫీజు రూ. 750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఉచితం.
విద్యార్హతలు..
- వైస్ ప్రెసిడెంట్ (ట్రాన్స్ఫార్మేషన్), సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- ప్రోగ్రామ్ మేనేజర్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- క్వాలిటీ అండ్ ట్రైనింగ్ (ఇన్‌బౌండ్ అండ్ ఔట్‌బౌండ్), సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- కమాండ్ సెంటర్ పోస్టులకు కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ (మార్కెటింగ్) పోస్టుకు ఎంబీఏ/పీజీడీఎం లేదా ఎంబీఏ(మార్కెటింగ్) ఫైనాన్స్ ఒక సబ్జెక్టుగా లేదా ఎంబీఏ(ఫైనాన్స్) మార్కెటింగ్ ఒక సబ్జెక్టుగా లేదా ఎంబీఏ(డ్యూయల్) ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్.
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)/ చీఫ్ మేనేజర్ (మార్కెటింగ్) ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఎంబీఏ/పీజీడీబీఎం లేదా మార్కెటింగ్/ఫైనాన్స్ సబ్జెక్టుల్లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం..
ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తునకు చివరి తేది 2023 జూన్ 2.
ఎంపిక విధానం..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వారి విద్యార్హతలు, అనుభవం ఆధారంగా బ్యాంకు అధికారులు షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి